మంత్రి గంగుల కమలాకర్ కు ఐలమ్మ జయంతి వేడుకల ఆహ్వాన పత్రికను అందజేస్తున్న రజక సంఘం నేతలు
జగదేవ్ పూర్, సెప్టెంబర్ 25 (జనంసాక్షి):
తెలంగాణ పోరాట వీరవనిత చాకలి ఐలమ్మ 127వ జయంతి వేడుకలను పురస్కరించుకుని ఈ నెల 26వ తేదీన ప్రభుత్వం హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో నిర్వహించే జయంతి వేడుకల కార్యక్రమానికి రావాలని కోరుతూ రాష్ట్ర రజక సంఘం నేతలు ఆదివారం రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖా మంత్రి గంగుల కమలాకర్ కు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం లో రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం లో పోరాడి అసువులు బాసిన ఉద్యమకారులకు సముచితమైన స్థానం ఇచ్చారని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమకారులను స్మరించుకోవడం మన బాద్యతని అలాంటి కోవలోకి చెందిన మన వీరవనిత చాకలి ఐలమ్మ జయంతి అధికారికంగా జరుపుకోవడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రజక సంఘాల సమితి చైర్మన్ అక్కరాజు శ్రీనివాస్, వైస్ చైర్మన్ పెద్దాపురం కుమారస్వామి, పంజగారి ఆంజనేయులు, ఐలమ్మ జయంతి వేడుకల కమిటీ రాష్ట్ర కన్వీనర్, జగదేవ్ మండల రజక సంఘం అధ్యక్షుడు రాచమల్ల ఎల్లేష్ తదితరులు పాల్గొన్నారు.