మంత్రి టీజీ వెంకటేశ్‌పై క్రిమినల్ కేసు నమోదు
రంగారెడ్డి: ఐఏఎస్ అధికారులపై నోటి దురుసుతో వ్యవహరించినందున మంత్రి టీజీ వెంకటేశ్‌పై క్రిమినల్ కేసు నమోదైంది. ఐఏఎస్ అధికారులపై వివాదాస్పద వ్యాఖ్యాలు చేసిన మంత్రిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మేడ్చల్ పోలీసు స్టేషన్లో మాజీ ఐఏఎస్ అధికారి పాపారావు కేసు నమోదు చేశారు. ఐఏఎస్ అధికారులను కాల్చి చంపాలని మంత్రి చేసిన వ్యాఖ్యాలు తీవ్రమైనవని పాపారావు ఆక్షేపించారు. ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని అభ్యర్థించారు.