మంత్రి డీకే అరుణకు తెలంగాణ సెగ
మహబూబ్‌నగర్, జనంసాక్షి: జిల్లాలో ప్రభుత్వ పథకాలపై ప్రచారం నిర్వహించడానికి బస్సు యాత్ర నిర్వహిస్తున్న మంత్రి డీకే అరుణకు తెలంగాణ సెగ తగిలింది. ఉప్పునూతల మండలం కొడికల్‌కు బస్సు యాత్ర చేరుకోగానే గ్రామంలోని మహిళలు బస్సును అడ్డుకున్నారు. జై తెలంగాణ, తెలంగాణ ద్రోహి డీకే అరుణ అంటూ మహిళలు నినాదం చేశారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.