మంత్రి పర్యటన ఏర్పాట్ల పరిశీలన

నంగునూరు మండలం గట్లమల్యాల గ్రామంలో రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు రాబోయే రెండు మూడు రోజుల్లో పర్యటించి పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేయనున్న నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లను శుక్రవారం పరిశీలించినట్లు గ్రామ సర్పంచ్ తిప్పని రమేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గ్రామంలో గంగిరెద్దుల కాలనీలో నిర్మించిన ఓవర్ హెడ్ త్రాగు నీటి ట్యాంక్, గొల్ల, కూర్మల కోసం ఏర్పాటు చేసిన పశువుల హాస్టల్, ప్రభుత్వ హెల్త్ సబ్ సెంటర్ ను మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా ప్రారంభింపజేస్తామన్నారు. కావున మండల పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. అనంతరం ఫ్రైడే-డ్రైడే కార్యక్రమం పాల్గొని సఫాయి కార్మికులతో కలిసి రోడ్లపై చెత్తాచెదారాన్ని తొలగించారు. ఇంటింటా తిరుగుతూ తడి పొడి చెత్త వేరు చేయడం స్వచ్ఛత, పరిసరాల పరిశుభ్రత, వైరల్ వ్యాధుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి  గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తిప్పని రమేష్ తో పాటు సఫాయి కార్మికులు, ఏఎన్ఎంలు, కారాబార్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.