మంత్రి హరీష్ రావు పర్యటన విజయవంతం చేయండి.

ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి.
తాండూరు సెప్టెంబర్ 8(జనంసాక్షి)రాష్ట్ర ఆర్థిక ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు పర్యటనను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు మాజీ మంత్రి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి పిలుపునిచ్చారు.గురువారం తన నివాసంలో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను మంత్రిగా ఉన్న హయంలో కోట్లాది రూపాయల తో నిధులు తీసుకువచ్చామని పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులు ఇప్పుడు పూర్తి అయ్యాయని ఇంకా రెండు సంవత్సరాల వరకు పెండింగ్ పనులు పూర్తి అవుతాయని అన్నారు. పేద ప్రజల అభివృద్ధి సంక్షేమ ధ్యేయంగా టిఆర్ఎస్ పార్టీ పనిచేస్తుందని అన్నారు. ఎన్నికల సమయంలో ఇవ్వని హామీలను సైతం పేదల సంక్షేమం కోసం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు తీసుకోవచ్చారని అన్నారు. తాండూర్ లోని మాతా శిశు ఆసుపత్రిలో షెడ్డు నిర్మాణం, సీసీ రోడ్డు పనులు, పాత తాండూరులో బస్తీ దవఖాన ప్రారంభోత్సవం, వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ ప్రారంభొ త్సవంతో పాటు తాండూరు మండలం జినుగుర్తిలోని కేజీబీవీలో అదనపు బ్లాక్ ప్రారంభోత్సవం, ఆశ వర్కర్లకు చీరల పంపిణీలో మంత్రి హరీష్ రావు పాల్గొంటారని తెలిపారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కరణం పురుషోత్తం రావు, తాండూర్ పట్టణ మున్సిపల్ చైర్ పర్సన్ తాటికొండ స్వప్న, మాజీ పట్టణ అధ్యక్షుడు అబ్దుల్ రావుఫ్,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వడ్డే శ్రీనివాస, కౌన్సిలర్స్ రత్న మాల నర్సింహులు, మణ పురం రాము ప్రవీణ్ గౌడ్, వెంకన్న గౌడ్ బోయ రవి రాజు, కో ఆప్షన్ సభ్యులు అబ్దుల్ ఖవి తదితరులు పాల్గొన్నారు.