మంథనిలో కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీ చించివేత – ధర్నాకు దిగిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు

జనంసాక్షి, మంథని, అక్టోబర్ 06 : పెద్దపల్లి జిల్లా మంథని మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంథని పాతపెట్రోల్ బంక్ చౌరస్తాలో శుక్రవారం కాంగ్రెస్ నాయకులు ధర్నాకు దిగారు. మంథని మున్సిపల్ అనుమతి తీసుకొని కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన అటువంటి ఆరు గ్యారంటీ హామీలతో కూడిన ఫ్లెక్సీని మంథని పాత పెట్రోల్ బంక్ సమీపంలో ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల ఫ్లెక్సీని అగాంతకులు అర్ధరాత్రి చింపివేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని కాంగ్రెస్ పార్టీ మంథని మండల అధ్యక్షుడు ఐలి ప్రసాద్, ఇతర ముఖ్య నాయకులు అన్నారు. ప్రజల్లో ఆదరణ కోల్పోయి, ప్రజల నుంచి స్పందన లభించక, కాంగ్రెస్ పార్టీకి వస్తున్నటువంటి అశేష ఆదరణను చూసి తట్టుకోలేక కాంగ్రెస్ పార్టీ ప్లెక్సిని చించి వేశారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు చింపిన దుండగులను వారి వెనుక ఉండి ప్రోత్సహించిన వారిని పోలీసు వారు అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పోలు శివ, కౌన్సిలర్ రమ సురేష్ రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ జిల్లా చైర్మన్ ముస్కుల సురేందర్ రెడ్డి, మంథని సత్యం, జనగామ నర్సింగరావు, నూకల బానయ్య, బండారి ప్రసాద్, ఎరుకల ప్రవీణ్, జనగామ సద్వాల్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు, యూత్ కాంగ్రెస్, ఎస్సీ సెల్, బీసీ సెల్, మైనార్టీ సెల్, మహిళా విభాగం నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు