మంథనిలో బీఎస్పీ జెండా ఎగరవేస్తాం..! – మంథని నియోజక వర్గ ఇన్చార్జ్ రమేష్

జనంసాక్షి, మంథని, అక్టోబర్ 7
మంథని నియోజకవర్గంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తాము బహుజన సమాజ్ పార్టీ జెండా ఎగరవేస్తామని మంథని నియోజకవర్గ ఇన్చార్జ్ అట్టం రమేష్ పేర్కొన్నారు. శనివారం మంథని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ కాంగ్రెస్ బిజెపి పార్టీలపై ప్రజలు విరక్తి చెంది ఉన్నారని రాబోయే రోజుల్లో రాష్ట్రంలో బహుజన జెండా ఎగురుతుందని ఆయన అన్నారు. రాష్ట్ర హోంమంత్రి ఆయన వ్యక్తిగత గన్మెన్ పై చేయి చేసుకోవడం చాలా బాధాకరమని అలాంటి మంత్రులను రాష్ట్ర కేబినెట్ నుండి తొలగించే ప్రయత్నం చేయాలని వారు డిమాండ్ చేశారు. రాజకీయ నాయకులకు ఎల్లవేళలా భద్రతను కల్పించి కాపాడే పోలీసులను కొట్టడం సిగ్గుచేటు అన్నారు. అనంతరం బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర ఈసీ సభ్యుడు దేవునూరి సంపత్ మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని వ్యక్తిగత గన్మెన్పై చేయి చేసుకున్న రాష్ట్ర హోం మంత్రి మహమ్మద్ అలీ పై రాష్ట్ర ముఖ్యమంత్రి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జోనల్ మహిళా కన్వీనర్ కుమ్మరి సవిత, కార్మిక విభాగం రాష్ట్ర కోకన్వీనర్ వేగా నరేష్, జిల్లా కోశాధికారి కందుల రాజన్న, మంథనియోగ వర్గం అధ్యక్షుడు రామిళ్ళ రాకేష్, కమాన్పూర్ మండల వైస్ ప్రెసిడెంట్ మామిడి అనిల్, మల్హరి మండల అధ్యక్షుడు రాజకుమార్, జిల్లా ఈసీ మెంబర్ ఈదునూరి ధర్మరాజు, రామగుండం బిఎస్పి నాయకుడు మల్లేశులు పాల్గొన్నారు.