మంథని ఎస్సైని కలిసిన యూత్ కాంగ్రెస్ నాయకులు

జనంసాక్షి , మంథని : పెద్దపల్లి జిల్లా మంథని నూతన ఎస్సైగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఆది మధుసూదన్ రావు ను యూత్ కాంగ్రెస్ నాయకులు సోమవారం మర్యాద పూర్వకంగా కలిసి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమములో జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు జెమినిగౌడ్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు బర్ల శ్రీనివాస్ ,ఎరుకల ప్రవీణ్, పెంటరి రాజు, అజీంఖాన్, నరసింహారెడ్డి, కిరణ్ గౌడ్ ,ఎరుకల రమేష్ బాబు ,పోరండ్ల రంజిత్ , పెరుగు తేజ పటేల్, గుండేటి రాజశేఖర్, జనగామ సడవలి, కేక్కెర్ల సందీప్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.