మంథని పోచమ్మ వాడ లో “కమ్యూనిటీ కాంటాక్ట్”
ప్రోగ్రాం
జనంసాక్షి , మంథని : రామగుండం పోలీస్ కమీషనర్ రెమా రాజేశ్వరి ఐపీస్ (డి ఐ జి) ఆదేశాల మేరకు మంథని పోలీస్ స్టేషన్ పరిధిలోని పోచమ్మవాడ ప్రాంతంలో గురువారం గోదావరిఖని ఏసీపీ తుల శ్రీనివాస్ పర్యవేక్షణ లో గోదావరిఖని 2టౌన్ 2సీఐ ఆఫజలుద్దీన్ , మంథని ఎస్ఐ కిరణ్ ఆధ్వర్యం లో 20 మంది అధికారులు, సిబ్బందితో కలిసి కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించి స్థానిక ప్రజలతో మాట్లాడడం జరిగింది. వాహన పత్రాలు సరిగా లేని 30 బైక్ లను సిజ్ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా సీఐ సతీష్ మాట్లాడుతూ… నేరాల నిర్మూలన కోసమే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజల రక్షణ, భద్రత పోలీస్ బాధ్యత అని , గ్రామలలో కొత్త వ్యక్తులు, నేరస్తులు, షెల్టర్ తీసుకుని ఉంటే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఎవరైనా కొత్త వారు అద్దెకు వస్తే వారికి సంబందించిన పూర్తి సమాచారం తీసుకోవాలి అన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకూడదని, యువత చెడు అలవాట్లకు బానిసగా మారి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. ఏవైనా సమస్యలున్నా తమ దృష్టికి తీసుకరావాలని లేదా సమస్యలుంటే 100 నంబర్ కి కాల్ చేయాలని సూచించారు. సైబర్ నేరాలు, మోసగాళ్ల ఫోన్ కాల్స్, మెసెజ్ లకు, వాట్సాప్ కాల్స్ కు స్పందించవద్దని సూచించారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు. వాహనాలు నడిపే టప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలి అని సూచించారు. డ్రైవింగ్ లైసెన్స్ అందరు కలిగి ఉండాలి అన్నారు. గ్రామలలో మరింత స్వీయ రక్షణ కొరకు సీసీ. కెమెరాలను అమర్చుకోవాలని ఈ విషయంలో పోలీసుల సహకారం ఉంటుందని, భద్రతా పరమైన అంశాల లో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. మరియు షీ టీం యొక్క ప్రాముఖ్యతను, మహిళల రక్షణ పట్ల తీసుకుంటున్న చర్యలను వివరించారు.