మందమర్రి ఎన్నికపై దృష్టి పెట్టాం

ఆదిలాబాద్‌,ఫిబ్రవరి17( (జ‌నంసాక్షి) ): మందమర్రి మున్సిపల్‌ పాలకవర్గ ఎన్నికల నిర్వహణ కోసం ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేంద్రానికి లేఖ రాశారని ఎమ్మెల్యే నల్లాల ఓదెలు తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వం తనవంతుగా చర్యలు తీసుకుంటున్నదని అన్నారు. తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఇలా ఎన్నికలు జరగని ప్రాంతాలను గుర్తించి ఒకేసారి రాజ్యాంగ సవరణ ద్వారా వీటికి ఎన్నికలు జరిపించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు అన్ని మౌలిక సదుపాయాలను కల్పించడమే ధ్యేయంగా పనిచేస్తునట్లు అన్నారు. ఎనిమిది నెలల్లో నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టినట్లు చెప్పారు. ప్రజలు ఆత్మగౌరవంతో బతకాలనే ధ్యేయంతో సీఎం కేసీఆర్‌ పనిచేస్తున్నారని, అన్ని రంగాలను అభివృద్ధిపరిచేందుకు ముఖ్యమంత్రి ముందుకు సాగుతున్నారని అన్నారు.  ఎన్నికల సందర్భంగా తెరాస ఇచ్చిన హావిూలను ఆచరణలో పెట్టేందుకు సీఎం అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారన్నారు. ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ ¬దా తీసుకువచ్చేందుకు తనవంతు కృషి చేస్తున్నట్లు చెప్పారు.