మగవేషంలో శబరిమలైకి యువతి

చెన్నై, జూన్ 17 : శబరిమలై అయ్యప్ప ఆలయానికి మగవేషంలో వెళ్లిన యువతిని భద్రతాధికారులు గుర్తించి వెనక్కి పంపారు. పోలీసుల కళ్లు గప్పి ఎలాగైనా స్వామివారి దర్శనం చేసుకోవాలన్న పట్టుదలతో గురువారం రాత్రి 7 గంటలకు ప్యాంటు, షర్టు వేసుకొని బయలుదేరింది. పంబానది ప్రాంతంలో ఆమె నడిచి వెళ్తుండగా ఆలయ భద్రతాధికారులు అడ్డుకొని ప్రశ్నించారు. ఆలయంలోకి ప్రవేశించేందుకు గుండు గీయించుకొని మగవేషంతో వచ్చినట్లు ఆమె విచారణలో చెప్పింది. అమెను మదురైకి చెందిన లక్ష్మి(18)గా గుర్తించారు. శబరిమలై ఆలయలోకి మహిళలకు ప్రవేశం లేని విషయం తెలిసిందే. ఈ సంప్రదాయాన్ని మార్చాలని కోరు తూ కేరళ న్యాయవాదుల సంఘం న్యాయస్థానంలో వేసిన కేసు పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో ఆలయానికి వెళ్లేందుకు ఇదే విధంగా ప్రయత్నిస్తున్న మహిళలను గుర్తించి వెనక్కి పంపిస్తున్నారు.