మట్టి గణపతి పూజిద్దాం పర్యావరణాన్ని పరిరక్షిద్దాం

ఎంపీపీ కన్నెబోయిన జ్యోతి బలరాం.

రామన్నపేట ఆగస్టు 31 (జనంసాక్షి)      మట్టి గణపతి పూజిద్దాం పర్యావరణాన్ని పరిరక్షిద్దాం అని ఎంపీపీ  కన్నెబోయిన జ్యోతి బలరాం అన్నారు. మండల కేంద్రంలోని కక్కిరేణి గ్రామంలో తన స్వగృహం నందు మట్టి గణపతులను పంపిణీ చేసి,
అనంతరం వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణపతి పూజించే విధానాన్ని యువత అవలంబించాలని కోరారు..
ప్లాస్టర్ ఆఫ్ పారిస్ నీటిలో కలిసినప్పుడు నీటిని వేడిగా చేస్తుంది. మనిషిలో ఉండే జీవుల జీర్ణవ్యవస్థ, శ్వాస వ్యవస్థ, విసర్జక వ్యవస్థ పై ప్రభావం పడుతుంది. మనం ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వాయువును గాలి ద్వారా పీల్చుకున్నప్పుడు మెదడు దెబ్బతింటుంది. దాని వలన కోమాలోకి పోయే ప్రమాదం ఉంది.కాబట్టి
ప్లాస్టర్ ఆఫ్ పారిస్ కు బదులు మట్టిని వాడుదాం వినాయక చవితి పండుగలో మట్టి వినాయకుడితో పర్యావరణాన్ని కాపాడుదాం. పూర్వకాలంలో వినాయక చవితి అనగానే సహజమైన బంక మట్టితో వినాయకుడిని తయారుచేసి పూజించేవారు. ఎటువంటి రసాయన వినాయకులను కాకుండా ప్రకృతి హితమైన విగ్రహాన్ని తాయారు చేసుకోవాలనీ గ్రామ ప్రజలను కోరారు.

తాజావార్తలు