మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేసిన జడ్పీటీసీ గీకురు
జనంసాక్షి/చిగురుమామిడి – ఆగష్టు31:
మండల కేంద్రములో తెరాస గ్రామ శాఖ ఆధ్వర్యములో ప్రభుత్వముచే పంపబడిన మట్టి విగ్రహాలను భక్తులకు స్థానిక జడ్పీటీసీ సభ్యులు గీకురు రవీందర్ బుధవారం పంపిణి చేశారు. రాష్ట్ర ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్ కుమార్, శాసన సభ్యులు వొడితెల సతీష్ కుమార్ సూచన మేరకు మండలంలోని అన్ని గ్రామాలకు గ్రామ శాఖల ద్వారా పంపిణి చేయనైనదని తెలిపారు.ఈ సందర్బంగా జడ్పీటీసీ రవీందర్ మాట్లాడుతూ మండల ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియ జేస్తూ, విగ్నాలు తొలిగి ప్రజలందరి సకల కార్యాలు శుభప్రదంగా కొనసాగాలని ఆకాంక్ష వెలిబుచ్చారు. నవ రాత్రులు భక్తి పారవశ్యముతో, సోదర భావముతో, సమగ్రత భావనతో ఉత్సాహంగా జరుపుకొనాలన్నారు. అంతేగాక మంటప నిర్వాహకులు పోలీస్ శాఖ నిబందనలు పాటిస్తూ అగ్ని ప్రమాదాలు, విద్యుత్ ఘాతాలు అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం, కాలుష్య నివారణ కొరకు, ప్రజారోగ్యం కోసం మట్టి విగ్రహాలను మాత్రమే పూజించాలని కోరారు.ఈకార్యక్రమములో జడ్పీటీసీ సభ్యులతో పాటు స్థానిక సర్పంచ్ బెజ్జంకి లక్ష్మణ్, రైతు బంధు నాయకులు సాంబారి కొమురయ్య, గ్రామశాఖ అధ్యక్షులు బుర్ర శ్రీనివాస్, అనుబంధ విభాగాలు ఎస్సీ సెల్ అధ్యక్షులు బెజ్జంకి అంజయ్య, మైనార్టీ సెల్ అధ్యక్షులు సర్వర్ పాషా, మహిళా నాయకురాలు గొల్లపెల్లి అరుణ, వార్డ్ సభ్యులు సౌజన్య, చెరుకు సంజీవ్, ఏలూరి బాలరాజ్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.