మట్టి వినాయక విజేతలను ప్రకటించిన మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దీప నర్సింహులు.

తాండూరు సెప్టెంబర్ 11(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దీప నర్సింహులు ఆధ్వర్యంలో లక్కీ డ్రాను తీశారు.మట్టి వినాయక లక్కీ డ్రాలో
10 గ్రాముల గోల్డ్ , వెండి బహుమతులను
గెలుపొందిన విజేతలు..భ్రమరాంబ, బాలు, పటేల్ రవిశంకర్, చంద్రకాంత్, తలారి సంతోష్ కుమార్, మోచి అనిత, వశిష్ట విలాస్ ,సువర్ణ రెడ్డి, స్రవంతి, బి. శ్రీనివాస్, వీరికి 10 గ్రాముల గోల్డ్ కాయిన్ లభించగా మరో 50 మందికి వెండి చిక్కలు బహుమతులుగా గెలుపొందారు. అయితే గత నెల 31న వినాయక చవితి పురస్కరించుకొని తాండూరు నియోజకవర్గంలో మట్టి వినాయ కుడిని ప్రతిష్టాపించండి బంగార ము మరియు వెండి నాణేలను గెలుపొందగలర ని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ప్రకటించిన విషయం పాఠకులకు తెలిసింది ఇందులో భాగం గానే ఆదివారం సాయంత్రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దీప నర్సింహులు విజేతలను ప్రకటించారు .ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాబోయే తరాలను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు మట్టి వినాయకులను ప్రతిష్టాపించి పూజించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 26వ వార్డు కౌన్సిలర్ మంకాల్ రాఘవేందర్ , పోట్లు మహారాజ్ ఆలయ చైర్మన్ రాజన్ గౌడ్, స్టేషన్ హనుమాన్ మందిర ఆలయం చైర్మన్ సంజీవ్ రావు,, మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్,యువ నాయకులు చంటి యాదవ్ ఇంతియాజ్ బాబాతోపాటు తదితరులు పాల్గొన్నారు.