మడగాస్కర్లో విషాదం.. తొక్కిసలాటలో 12 మంది మృతి
మడగాస్కర్ లో ఘోరం జరిగింది. దేశ రాజధాని అంటనవారివోలోని స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో 13 మంది చనిపోయారు. దాదాపు 80 మంది గాయపడ్డారు. మహామాసినా స్టేడియంలో ఇండియన్ ఓషన్ ఐలాండ్ గేమ్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా ఈ ఘటన జరిగింది. పరిమితికి మించి ప్రేక్షకులు రావడంతో ప్రమాదం చోటుచేసుకుందని అధికారులు చెప్పారు. 11వ ‘ఇండియన్ ఓషన్ ఐలాండ్ గేమ్స్ ప్రారంభోత్సవానికి 50,000 మంది ప్రేక్షకులు హాజరయ్యారు. అయితే వారంతా ఒక్కసారిగా స్టేడియంలోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఎంట్రెన్స్ వద్ద తొక్కిసలాట జరిగింది. పదుల సంఖ్యలో జనం కింద పడిపోగా వారిని తొక్కుకుంటూ వెళ్లిపోయారు. ఈ ఘటనలో గాయపడిన వారిని వెంటనే స్థానిక హాస్పిటల్ కు తరలించారు. అయితే చికిత్స పొందుతూ 12 మంది చనిపోయారు. గాయపడినవారికి చికిత్స కొనసాగుతోంది.