మణిపూర్‌లో దారుణం
` సిగ్గుతో తలదించుకున్న దేశం
` మహిళలను నగ్నంగా ఊరేగించిన దుండగులు
` ఆపై సామూహిక అత్యాచారం చేసి హత్య చేసిన వైనం
` ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన
` పరాకాష్టకు చేరిన జాతుల మధ్య వైరం
` ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు
` నిందితులకు బహిరంగ ఉరేస్తామన్న ఆ రాష్ట్ర సీఎం
ఇంఫాల్(జనంసాక్షి): మణిపూర్ అల్లర్లకు సంబంధించి ఓ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి..ఆపై సామూహిక అత్యాచారం చేసి చంపిన ఘటన తీవ్ర దుమారం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో బహిర్గతం అయ్యింది. దీంతో దేశం యావత్తూ తలదించుకుంది. ఇలాంటి అమానవీయ ఘటనపై ప్రధాని మోడీ తీవ్రంగా స్పందించారు. కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. సుప్రీంకోర్టు కూడా కేసును సుమోటా తీసుకుంది. ఈ నేరానికి పాల్పడ్డ వారికి బహిరంగ ఉరి వేస్తామని సిఎం ప్రకటించారు. ఘటనపై చర్చకు పార్లమెంటులో విపక్షం పట్టుబట్టింది. మణిపూర్‌లో రెండు తెగల మధ్య చాన్నాళ్ల నుంచి ఘర్షణాత్మక వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. అయితే రెండు నెలల క్రితం ఇద్దరు మహిళల్ని నగ్నంగా ఊరేగించారు. ఆ ఘటనకు చెందిన వీడియో ఒకటి తాజాగా వైరల్ అయ్యింది. ఆ మహిళల్ని నగ్నంగా పరేడ్ చేయించిన వ్యక్తిని అరెస్టు చేశారు. అతన్ని 32 ఏళ్ల హీరాదాస్‌గా గుర్తించారు. అతనిది తౌబాల్ జిల్లాగా గుర్తించారు. మణిపూర్‌లోని కంగ్‌పోప్కీ జిల్లాలో మే 4వ తేదీన ఈ ఘటన జరిగింది. అయితే బుధవారం ఆ వీడియో మరోసారి వైరల్ అయ్యింది. ఆ వీడియోపై ఆ రాష్ట్ర సీఎం బీరేన్ సింగ్ స్పందించారు. నిందితులకు మరణదండన ఉంటుందన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేశారు. కిడ్నాప్, గ్యాంగ్‌రేప్, మర్డర్ కింద కేసు బుక్ చేశారు. నిందితుడిని అరెస్టు చేసేందుకు పోలీసులు 12 బృందాలుగా అన్వేషించారు. మహిళల్ని నగ్నంగా పరేడ్ చేయించిన ఘటనను సుమోటోగా తీసుకుని దర్యాప్తు చేపట్టామని, గురువారం ఉదయం ఒకర్ని అరెస్టు చేసినట్లు సీఎం బీరేన్ సింగ్ తెలిపారు. సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నామని, నిందితులకు కఠిన శిక్ష విధిస్తామన్నారు. ఇలాంటి ఘటనలకు సమాజంలో చోటులేదన్నారు. కుకీ తెగను చెందిన మహిళల్ని.. మైటేయి తెగకు చెందిన వ్యక్తులు నగ్నంగా ఊరేగించారు. మణిపూర్‌లో హింసాత్మక ఘటనల నేపధ్యంలో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో వెలుగుచూడటం కలకలం రేపింది. ఈ ఘటన తీవ్ర దుమారం రేపడంతో గురువారం ఉదయం ఓ నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ వీడియో ఆధారంగా సుప్రీంకోర్టు సమోటోగా ఈ ఘటనను పరిగణనలోకి తీసుకుంది. ఇక మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు చేపడతామని మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ స్పష్టం చేశారు. ఈ ఘటన పట్ల ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నిందితులను విడిచిపెట్టబోమని వారిపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర చర్యలు చేపడుతుందని పేర్కొన్నారు. మణిపూర్ హింసాకాండపై, ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ నోరు మెదిపారు. ఇది నాగరిక ప్రపంచం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన అని మోదీ పేర్కొన్నారు. మణిపూర్ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని, ఈ ఘటనను రాజకీయం చేయవద్దని కోరారు. దేశం యావత్తూ ఈ ఘటనపై ఆగ్రహంతో ఉందని, నేరస్తులను తీవ్రంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. మణిపూర్‌లో కుకి`జోమి వర్గానికి చెందిన ఇద్దరు మహిళలను కొందరు నగ్నంగా తీసుకువెళుతున్న ఈ వీడియో సోషల్ విూడియాలో బుధవారం వెలుగుచూసింది. రెండు నెలల కిందట జరిగిన ఈ ఘటనలో మహిళలను నగ్నంగా ఊరేగించి ఆపై పలువురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడినట్టు వెల్లడైంది. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన మే 4న జరిగిందని, బాధితురాలిలో ఒకరు 19 ఏండ్ల యువతి అని పోలీస్ వర్గాలు తెలిపాయి. మణిపూర్‌లో ఇద్దరు మహిళల్ని నగ్నంగా పరేడ్ చేయించిన ఘటనపై మాజీ సీజేఐ, రాజ్యసభ ఎంపీ రంజన్ గగోయ్ స్పందించారు. ఆ ఘటన చాలా బాధాకరమని, అది దురదృష్టకర సంఘటన అని ఆయన అన్నారు. వర్షాకాల సమావేశాల ప్రారంభం నేపథ్యంలో ఆయన పార్లమెంట్‌కు వచ్చారు. ఈ సందర్భంగా అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మణిపూర్ ఘటనపై కామెంట్ చేయాల్సింది ఏవిూలేదన్నారు. జాతీయ మహిళా కవిూషన్ కూడా మణిపూర్ ఘటనను ఖండిరచింది. నగ్నంగా పరేడ్ చేయించిన ఘటనను సుమోటోగా స్వీకరిస్తున్నట్లు చెప్పింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని మణిపూర్ డీజీపీని కోరినట్లు జాతీయ మహిళా కమిషన్ పేర్కొన్నది. ఈ ఘటనకు చెందిన ఓ ప్రధాన నిందితుడిని అరెస్టు చేశారని ఎన్‌సీడబ్ల్యూ చీఫ్ రేఖా శర్మ తెలిపారు. ఇవాళ సాయంత్రం వరకు మరికొందర్ని అదుపులోకి తీసుకోనున్నట్లు వెల్లడిరచారు. ట్విట్టర్ సంస్థకు కూడా నోటీసులు ఇచ్చామని, ఇలాంటి వీడియోలను ఆపేయాలని సూచించామన్నారు. మణిపూర్ ఘటనపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా స్పందించారు. వీడియో వైరల్ కావడం వల్లే ప్రధాని మోదీ స్పందించారని ఓవైసీ విమర్శించారు. మణిపూర్‌లో ఊచకోత జరుగుతోందన్నారు. సీఎం బీరేన్‌సింగ్‌ను తొలగిస్తేనే అక్కడ న్యాయం జరుగుతుందని, తెగల వైరంపై సీబీఐ విచారణకు ప్రధాని ఆదేశించాలని ఓవైసీ డిమాండ్ చేశారు.మణిపూర్‌లో జరుగుతున్న పరిణామాల గురించి సభలో చర్చించాలని కాంగ్రెస్ ఎంపీ సోనియా గాంధీ ప్రధాని మోదీని కోరారు. ఈ విషయాన్ని మరో కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరీ తెలిపారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా ఇవాళ లోక్‌సభలో ఈ ఘటన జరిగిందన్నారు. తొలి రోజు సభ సందర్భంగా ప్రధాని మోదీ విపక్ష నేతల్ని కలిశారు. గ్రీటింగ్ చేస్తున్న సమయంలో సోనియా గాంధీతోనూ మోదీ మాట్లాడారు. విపక్ష నేతల బెంచ్ వద్దకు చేరుకున్న సమయంలో ఆయన సోనియాతో కాసేపు మాట్లాడారు. ఆ సమయంలో మణిపూర్ గురించి సభలో చర్చించాలని ప్రధాని మోదీని సోనియా కోరినట్లు అధిర్ రంజన్ తెలిపారు. మరోవైపు సోనియా ఆరోగ్యం గురించి మోదీ అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది.
మణిపూర్‌పై మౌనం మాట్లాడిరది
` మొదటిసారిగా నోరు విప్పిన ప్రధాని
` బాధతో పార్లమెంట్ సమావేశాలకు వస్తున్నా
` ఘటన తీవ్రంగా కలచివేసిందని వ్యాఖ్య
` ఘటన దేశానికి అవమానకరమన్న మోదీ
న్యూఢల్లీి(జనంసాక్షి): మణిపూర్‌లో జరిగిన అమానుష సంఘటన తనను తీవ్రంగా కలచివేసిందని, బాధించిందని ప్రధాని మోడీ చెప్పారు. ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంటుకు రావడానికి ముందు తన మనసు బాధ, ఆగ్రహంతో నిండిపోయాయని చెప్పారు. ఏ నాగరికతకైనా ఈ సంఘటన సిగ్గుచేటు అని స్పష్టం చేశారు. ఇది దేశానికి అవమానకరమని చెప్పారు. నేరాలపై, మరీ ముఖ్యంగా మహిళలపై జరిగే నేరాలపై కఠిన చర్యలు తీసుకోవడానికి వీలుగా చట్టాలను బలోపేతం చేయాలని అన్ని రాష్టాల్ర ముఖ్యమంత్రులను కోరారు. ఇటువంటి సంఘటనలు రాజస్థాన్‌లో జరిగినా, ఛత్తీస్‌గఢ్ లేదా మణిపూర్‌లో జరిగినా నిందితులు దేశంలో ఏ మూలలో ఉన్నా, శిక్ష నుంచి తప్పించుకోకూడదన్నారు. ఏ నిందితుడినీ వదిలిపెట్టేది లేదని దేశ ప్రజలకు తాను హావిూ ఇస్తున్నానని చెప్పారు. మణిపూర్ బిడ్డలకు జరిగిన అన్యాయానికి కారకులైనవారిని క్షమించేది లేదని స్పష్టం చేశారు. పార్లమెంటు సమావేశాల ప్రారంభానికి ముందు మోదీ గురువారం ఉదయం పార్లమెంటు వద్ద విూడియాతో మాట్లాడుతూ, మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన అమానుష సంఘటన తనను తీవ్రంగా కలచివేసిందని, బాధించిందని చెప్పారు. ఇది దేశానికి అవమానకరమని చెప్పారు. మణిపూర్‌లో జరిగిన దారుణం…మొత్తం దేశానికే కళంకం అని అన్నారు. మణిపూర్‌లో జరిగిన ఘటన దేశంలోని 140 కోట్ల ప్రజలందరికీ సిగ్గుచేటు. నిందితులను వదిలిపెట్టమని దేశ ప్రజలందరికీ మాట ఇస్తున్నాను. ఈ ఘటన గురించి తెలిసినప్పటి నుంచి నా గుండె మండుతోంది. మణిపూర్‌లోని మహిళలకు జరిగిన అన్యాయాన్ని ఎప్పటికీ క్షమించం అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
మణిపూర్ ఘటనపై సుప్రీం గుస్సా..
` మండిపడ్డ సీజైఏ చంద్రచూడ్
` స్వీయ విచారణకు ఆదేశించిన సుప్రీంకోర్టు
న్యూఢల్లీి(జనంసాక్షి): రెండున్నర నెలల నుంచి హింసాత్మక సంఘటనలు జరుగుతున్న మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన దారుణ సంఘటనపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి. వై చంద్రచూడ్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర ఆవేదన, బాధను వ్యక్తం చేశారు. మహిళల గౌరవానికి భంగం కలిగించిన ఈ సంఘటన దేశానికి అవమానకరమని, దోషులను వదిలిపెట్టేది లేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఈ సంఘటనపై సుప్రీంకోర్టు కూడా ప్రభుత్వాన్ని హెచ్చరించింది. రాజ్యాంగాన్ని తూలనాడే ఈ ఘటనపై సత్వరమే చర్యలు చేపట్టకపోతే తాము రంగంలోకి దిగుతామని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ హెచ్చరించారు. ఈ సంఘటనలో ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేసినట్లు మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బిరేన్ సింగ్ ప్రకటించారు. ఈ దారుణానికి బాధ్యులైనవారిని వదిలిపెట్టేది లేదని, మరణ శిక్ష విధించేందుకు సైతం వెనుకాడేది లేదని తెలిపారు. మెయిటీలు, కుకీల మధ్య ఘర్షణలు ప్రారంభమైన రోజు నుంచి మణిపూర్‌లో ఇంటర్నెట్ సేవలను నిలిపి వేశారు. ఇద్దరు కుకీ మహిళలను కొందరు వ్యక్తులు నగ్నంగా ఊరేగించినట్లు కనిపిస్తున్న ఓ వీడియో బుధవారం బయటపడటంతో అన్ని రాజకీయ పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసాయి. మణిపూర్ పరిస్థితిపై చర్చించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ విడుదల చేసిన ఓ వీడియో సందేశంలో, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మణిపూర్ పరిస్థితిపై మాట్లాడకపోతే, పార్లమెంటులో అంతరా యాలకు ఆయనే బాధ్యత వహించవలసి ఉంటుందన్నారు. ’మన్ కీ బాత్ ఇక చాలునని, మణిపూర్ గురించి మాట్లాడవలసిన సమయం వచ్చిందని అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇచ్చిన ట్వీట్‌లో, పార్లమెంటులో మణిపూర్ అంశాన్ని లేవనెత్తుతామని చెప్పారు. తాము ఇప్పటికే వాయిదా తీర్మానం ఇచ్చామన్నారు. ప్రధాని మోదీ మణిపూర్ అల్లర్లపై మౌనంగా ఉన్నారని దుయ్యబట్టారు. మోదీకి ఎన్డీయే సమావేశం ఏర్పాటు చేయడానికి సమయం ఉంది కానీ, మణిపూర్ వెళ్లడానికి సమయం లేదా? అని ప్రశ్నించారు. బీజేపీ డెమొక్రసీని మొబొక్రసీగా మార్చిందని మండిపడ్డారు. మణిపూర్‌లో మానవత్వం చచ్చిపోయిందన్నారు. నరేంద్ర మోదీ గారూ, విూ మౌనాన్ని ఇండియా ఎన్నటికీ క్షమించదని హెచ్చరిం చారు. కుకీ మహిళలను నగ్నంగా ఊరేగించిన దారుణ సంఘటనను సుప్రీంకోర్టు స్వీయ విచారణకు చేపట్టింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్ ఈ దారుణంపై స్పందిస్తూ, ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. మతపరమైన ఘర్షణలు చెలరేగే ప్రాంతంలో మహిళలను సాధనంగా ఉపయోగించుకోవడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా చేయడం రాజ్యాంగాన్ని తూలనాడటమేనన్నారు. సామాజిక మాధ్యమాల్లో బయటపడిన వీడియోలు తనను తీవ్రంగా కలచి వేశాయన్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే, తాము చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బిరేన్ సింగ్ ఇచ్చిన ట్వీట్‌లో, సమాజంలో ఇటువంటి అమానుష చర్యలకు ఎంతమాత్రం చోటు లేదన్నారు. ఇద్దరు కుకీ మహిళలను నగ్నంగా ఊరేగించిన సంఘటనలో ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. సామాజిక మాధ్యమాల ద్వారా బయటపడిన వీడియోలో మనసును కలచివేసే దృశ్యాలు కనిపించాయన్నారు. అత్యంత అగౌరవప్రదమైన, అమానుష చర్యలకు గురైన బాధిత మహిళలకు సంఫీుభావం తెలిపారు. ఈ వీడియో బయటపడిన వెంటనే మణిపూర్ పోలీసులు తక్షణ చర్యలు ప్రారంభించారని, గురువారం ఉదయం ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశారని చెప్పారు. ఈ సంఘటనపై క్షుణ్ణంగా దర్యాప్తు జరుపుతున్నామని, దోషులందరిపైనా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. దోషులకు మరణ శిక్ష విధించే అంశాన్నికూడా పరిశీలిస్తామన్నారు. ఇదిలావుండగా, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని బిరేన్ సింగ్‌ను ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.మణిపూర్ ఘటనను స్వతంత్ర ఎంపీ నవనీత్ రాణా ఖండిరచారు. మహిళలను అగౌరవపరచేవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దోషులను కఠినంగా శిక్షించాలని దేశంలోని మహిళలు, పార్లమెంటులోని మహిళలు ప్రధాని మోదీని కోరుతున్నట్లు తెలిపారు. మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బిరేన్ సింగ్ తన పదవికి రాజీనామా చేయాలని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన దారుణ సంఘటనపై సీబీఐ చేత దర్యాప్తు చేయించాలన్నారు.కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ, మణిపూర్ పరిస్థితి గురించి సభలో చర్చించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని తమ పార్టీ అగ్ర నేత సోనియా గాంధీ కోరారని చెప్పారు. ఆమె ఆరోగ్యం గురించి మోదీ అడిగి తెలుసుకున్నపుడు ఆమె ఆయన ముందు ఈ డిమాండ్ పెట్టారని తెలిపారు. మణిపూర్‌లో హింసాత్మక సంఘటనలను అదుపు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా ఆరోపించారు. ఆ రాష్ట్రంలో అంతర్యుద్ధం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించినట్లు ఓ పాత వీడియో బయటపడిన నేపథ్యంలో ఆమె స్పందిస్తూ, భారత్‌ను బీజేపీ ఇలా దిగజార్చిందని వ్యాఖ్యానించారు. మహువా మొయిత్రా ఇచ్చిన ట్వీట్‌లో, మణిపూర్‌లో అంతర్యుద్ధం జరుగుతోందని, ఆ రాష్ట్రంలో యుద్ధ నేరాలు కనిపిస్తున్నాయని అన్నారు. మన దేశంలో ఇలా జరుగుతోందని మండిపడ్డారు. బీజేపీ భారత దేశాన్ని ఈ స్థాయికి దిగజార్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. టీఎంసీ రాజ్యసభ సభ్యుడు సాకేత్ గోఖలే ఇచ్చిన ట్వీట్‌లో, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా నాయకత్వం, మార్గదర్శకత్వంలో బీజేపీ నిర్వహిస్తున్న జాతి నిర్మూలన ఇది అని ఆరోపించారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఈ దారుణాన్ని తీవ్రంగా ఖండిరచారు. ఇది అత్యంత అమానుష సంఘటన అని ఆగ్రహం వ్యక్తం చేశారు.