మణిపూర్‌లో మిలిటెంట్ల దాడి
20 మంది జవాన్ల మృతి
ప్రధాని ప్రగాఢ సంతాపం
న్యూఢిల్లీ,జూన్4(జనంసాక్షి): ఉగ్రవాద బెడద తగ్గిందన్న భావన ఏర్పడి అంతా ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో మణిపూర్‌లో ఉగ్రవాదుల దాడి జరిగింది. ఇందులో 20 మందికి పైగా సైనికులు దుర్మరణం చెందారు. మరో పన్నెండు మంది గాయపడ్డారు. మోతుల్ నుంచి రాజధాని ఇంఫాల్ వైపు వస్తున్న మిలిటరీ కాన్వాయ్‌పై కొందరు గుర్తుతెలియని మిలిటెంట్లు దాడి చేసి ఘాతుకానికి పాల్పడారు. దీనిపై ఇంకా పూర్తి వివరాలు తెలియవలసి ఉంది. అసోం రైఫిల్స్ కు చెందిన వారు ఒక మహిళను హత్య చేశారన్న ఆరోపణపై చందేల్ జిల్లాలో బంద్ జరుగుతోంది. ఈ బంద్ కు , ఉగ్రవాద దాడికి ఏమైనా సంబందం ఉందా అన్నది తెలియాల్సి వుంది. ఇక ఈ దాడిని భారత ప్రధాని నరేంద్రమోదీ తీవ్రంగా ఖండించారు. మృతి చెందిన అమర జవాన్లకు ప్రధాని ప్రగాఢ సంతాపం తెలిపారు. ఉగ్రవాదుల దాడి హేయమైన చర్య అన్న ప్రధాని రెచ్చగొట్టే చర్యలకు పాల్పడటం మంచిది కోదని హితవు పలికారు.