మణుగూరు ఓసి లో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు
పినపాక నియోజకవర్గం అక్టోబర్ 02 (జనం సాక్షి): మణుగూరు ఓసి ప్రాజెక్టు కార్యాలయంలో కొలువై ఉన్న శ్రీ విజయ దుర్గ మైసమ్మ తల్లి ఆలయంలో చతుర్థి వార్షిక శరన్నవరాత్రి దసరా ఉత్సవాల్లో ఏరియా జిఎం జి వెంకటేశ్వర్ రెడ్డి సునీత రెడ్డి దంపతులు ముఖ్య అతిథిగా పాల్గొని ఘనంగా పూజలు నిర్వహించారు ఆదివారం అమ్మవారు సరస్వతి దేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రాజెక్ట్ అధికారి శ్రీనివాసచారి కవిత, గని మేనేజర్ రాజేశ్వరరావు ఇందిరా, ప్రాజెక్ట్ ఇంజనీర్ రవీందర్ సుజాత, అధికారి నవీన్ ఇందు , ఆఫీసు సూపర్నెంట్ ఎన్ వెంకటేశ్వరరావు వనజ సింగరేణి వైద్యురాలు జ్యోతిర్మయి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు శ్రీనివాస శర్మ, కేశవ శర్మ, ఆధ్వర్యంలో సహస్రనామ పూజ సహస్ర నామాలతో కుంకుమార్చన నీరాజనం మంత్రపుష్పములు నిర్వహించారు, దేవులపల్లి సూర్య కుమారి ఆధ్వర్యంలో సౌందర్య లహరి పారాయణం కార్యక్రమం జరిగింది, ఆమెను ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు ఘనంగా సత్కరించారు, ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు సమీప గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలవకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ఎండి ఇంతియాజ్ పాషా , బిక్కసాని రవి,పువ్వాడ రాజేశ్వరరావు, వి రామ్మోహన రెడ్డి ,చిత్తారి నరేందర్, గొప్ప సుధాకర్, నగేష్ ఎన్ ఉపేందర్ రావు తదితరులు పాల్గొన్నారు.