మణుగూరు రైల్వేస్టేషన్‌లో సైకో వీరంగం
మణుగూరు: ఖమ్మం జిల్లా మణుగూరు రైల్వేస్టేషన్‌లో ఈరోజు ఉదయం ఓ సైకో వీరంగం సృష్టించాడుజ రైల్వేస్టేషన్ ఆవరణలో ఉన్న మూడు ఆటోలను ధ్వంస చేశాడు. స్టేషన్‌లో రైలు కోసం వేచివున్న ప్రయాణికులపై రాళ్లతో దాడి చేశాడు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. స్థానికులు, ప్రయాణికులు సైకోను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.