మతోన్మాదానికి కార్పొరేట్ దోపిడీకి వ్యతిరేకంగా
సిపిఎం రాష్ట్ర నాయకులు
గాంధారి జనంసాక్షి సెప్టెంబర్ 14
సిపిఎం ఏరియా కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు కార్యక్రమం గాంధారి మండలం చద్మల్ గ్రామాల్లో సిపిఎం ఏరియా కార్యదర్శి మోతిరం నాయక్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ముందుగా పార్టీ జెండాను శోభన్ వేగురవేశారు
ఈ సందర్భంగా మూడ్ శోభన్ వెంకట్ గౌడ్ మాట్లాడుతూ భూమి కోసం వెట్టిచాకిరి నుండి విముక్తి కోసం నిజాం నిరంకుశ రాచరిక పాలన నుండి స్వేచ్ఛ కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులకు ప్రజలంతా స్మరించుకోవాలని వారి స్ఫూర్తిని త్యాగాలను ప్రేరణగా తీసుకొని మతోన్మాదానికి కార్పొరేట్ దోపిడీకి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు
హైదరాబాద్ సంస్థానంలో నిజాం రాచరిక పాలన లో భూస్వాములు జాగీర్దారులు జమీందార్లు దేశ్ ముఖ్ లు పటేల్ పట్వారీలు ప్రజలను జలగల్లా పట్టిపీడిస్తుంటే వెట్టిచాకిరి కౌలు లెవీ పేరుతో దోచుకుంటుంటే భరించలేని పేదలంతా ఏకమై ఎర్రజెండా చేతపట్టి కులమతాలకు అతీతంగా పోరాటం చేసారు దేశానికి స్వాతంత్య్రం వచ్చిన వెంటనే భారత ప్రభుత్వంతో నిజాం యథాతథ ఒప్పందం చేసుకున్నాడు గ్రామాల్లో భూస్వాముల భూములు కాపాడడానికి, కమ్యూనిస్టులను అణిచివేసేందుకు సర్దార్ పటేల్ సైన్యాన్ని పంపాడు కాంగ్రెస్ ప్రభుత్వం నిజాంను రాజప్రముఖ్ గా ప్రకటించింది పటేల్ పంపిన సైన్యం నిజాంను లొంగదీయడానికి వస్తే నిజాంను ఎందుకు గవర్నర్గా నియమించారు మూడు రోజుల్లోనే నిజాం సైనికులు ఓడిపోయినప్పటికి మూడు సంవత్సరాలు పటేల్ సైన్యాలు తెలంగాణలో ఎందుకున్నాయో బిజెపి సమాధానం చెప్పాలి ప్రజలు పంచుకున్న భూములు గుంజి భూస్వాములకు అప్పగించడమే విముక్తా అని ప్రశ్నించారు 4వేల మంది కమ్యూనిస్టులను ఊచకోత కోయడం వేలాది మందిని కాన్సంట్రేషన్ క్యాంపులలో నిర్బంధించి చిత్రహింసలు పెట్టారు దీనిని దీనిని తెలంగాణ ప్రజలు మరిచిపోలేదని అన్నారు కమ్యూనిస్టుల పోరాటాల ఫలితంగానే హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం అయిందని అన్నారు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి మతాలకు సంబంధం లేదని గ్రామాల్లో భూస్వాములు దొరలు పటేల్ పట్వారీలు ఏ మతానికి చెందిన వారో ప్రజలకు తెలుసని అన్నారు బిజెపి చరిత్రను వక్రీకరించే వక్రబుద్ధి మానుకోవాలని హితవు పలికారు తెలంగాణ రైతాంగ పోరాట వారసత్వాన్ని కొనసాగిస్తూ భూమి కోసం భూస్వామ్య పెట్టుబడిదారీ దోపిడీ వ్యవస్థలను కూల్చడం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు
ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ మండల నాయకులు మధు, కిషన్ రావు రోజా రమవా చత్రు నాయక్ ప్రకాష్ నాయక్ శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు
Attachments area