మత్స్యకారులకు చేయూత
ఖమ్మం, అక్టోబర్ 25 : దళారుల కబంద హస్తాల నుంచి కాపాడడానికి జిల్లాలో చేపల పెంపకానికి చేయూతనివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. చెరువులలో చేపల పిల్లలు పెంచే దశ నుంచి మార్కెటింగ్ చేసేవరకు కూడా వారి వెన్నంటి సహకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. 2012-13 నుంచి మత్స్య శాఖ, డ్వామా, డిఆర్‌డిఎ శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమం చేపడుతోంది. దీని కోసం జిల్లాలో మత్స్య సహకార సంఘాల పరిధిలోని వంద చేపల చెరువులను ఎంపిక చేసింది. కలెక్టర్ సిద్ధార్థజైన్ ఆదేశాల మేరకు ఈ చెరువులలో మేలు రకం చేప పిల్లలను పెంచాలని నిర్ణయించారు. ఇందుకోసం మత్స్యకారులకు శిక్షణ ఇవ్వనున్నారు. చెరువుల లోతట్టు ప్రాంతంలో చిన్న చేప పిల్లలు పెంచేలా కుంటలను అభివృద్ధి చేయనున్నారు.