మత్స్యకారులపై మానవత్వం చూపండి

2

విక్రం షిండేతో ప్రధాని మోదీ

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 14(జనంసాక్షి):

భారత్‌, శ్రీలంక మత్స్యకారుల సమస్యను మానవతా దృక్పథంతో ఆలోచించి పరిష్కరించాలని శ్రీలంక ప్రధాని రనిల్‌ విక్రమసింఘేను ప్రధాని మోదీ కోరారు. శ్రీలంక ప్రధాని ¬దాలో భారత్‌ను తొలిసారి సందర్శంచిన రనిల్‌ విక్రమసింఘేతో కలిసి మోదీ విలేకరులతో మాట్లాడారు. ‘మత్స్యకారుల సమస్యను శ్రీలంక ప్రధాని, నేను చర్చించాం. ఈ సమస్యను పరిష్కరించడానికి రెండు దేశాలకు చెందిన మత్స్యకారుల సంఘాలు కృషి చేయాలన్నదానిపై ఇద్దరం ఒక అంగీకారానికి వచ్చాం’ అని మోదీ అన్నారు. మత్స్యకారుల జీవనోపాధిపై ప్రభావం చూపై సమస్యగా దీన్ని పరిగణించాలని శ్రీలంక ప్రధానిని కోరానని చెప్పారు. చేపల వేటను ప్రోత్సహించడానికి తాము తీసుకుంటున్న చర్యలను విక్రమసింఘేకు వివరించినట్లు కూడా మోదీ ఈ సందర్భంగా తెలిపారు.

సంగక్కరపై ప్రధాని మోదీ ప్రశంసలు

ఇటీవల టీమిండియాతో జరిగిన రెండో టెస్టు అనంతరం అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి వీడ్కోలు తీసుకున్న శ్రీలంక మాజీ కెప్టెన్‌ సంగక్కరపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. సంగక్కర ఒక గొప్ప క్రికెటర్‌ అని, అతని సేవలను శ్రీలంక క్రికెట్‌ జట్టు కోల్పోవడం ఒక తీరని లోటేనని మోదీ కొనియాడారు. శ్రీలంక క్రికెట్‌ ను ఉన్నత స్థాయిలో నిలిపిన సంగక్కర అందరకీ ఆదర్శప్రాయమన్నారు.

శ్రీలంక ప్రధాని రాణిల్‌ విక్రమసింఘే తో సంయుక్తంగా విూడియా సమావేశానికి హాజరైన మోదీ.. సంగక్కరను మరోసారి గుర్తుచేసుకుంటూ ఈ విధంగా స్పందించారు. క్రికెట్‌ లో గొప్ప ఆటగాళ్లలో సంగక్కర ఒకడు. అతను శ్రీలంకకు అందించిన సేవలు మరువలేనివి. వికెట్‌ కీపర్‌ గా, ఎడమచేతి వాటం బ్యాట్స్‌ మెన్‌ గా అమోఘమైన రికార్డును సంగా సొంతం చేసుకున్నాడు. సంగాను క్రికెట్‌ ఫీల్డ్‌ లో చూసే అవకాశాన్ని మనమందరం కోల్పోతున్నాం అని మోదీ ప్రశంసించారు.