మద్యం వద్దు, సడలింపులొద్దు

పకడ్బందీ లాక్‌డౌన్‌కే జనం మొగ్గుసడలింపు లేని లాక్‌ డౌన్‌ కే జై!

` తెంగాణలో లాక్‌ డౌన్‌ ను యథావిధిగా కొనసాగించాంటున్న ప్రజు

` రంజాన్‌ పండుగ ముందు సడలిస్తే మరింత ముప్పు

` వైన్‌ షాపుకు కూడా సడలింపు వద్దు

` పూట గడిచే పరిస్థితి లేని వారు అప్పు పావుతారు

` ఆర్థికంగా మధ్య తరగతి కుటుంబాు మరింత దిగజారే అవకాశం

` సడలిస్తే రంజాన్‌ కొనుగోళ్ళతో మార్కెట్లలో,

మందుబాబుతో వైన్‌ షాపు వద్ద భౌతిక దూరం పాటించడం అసాధ్యం`

తెంగాణలో లాక్‌డౌన్‌ అముపై ‘జనంసాక్షి’ ప్రత్యేక సర్వే..

రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు అము చేస్తున్న లాక్‌ డౌన్‌ ను ఇలాగే కొనసాగించాని తొంబై శాతానికి పైగా ప్రజు కోరుకుంటున్నారు. ఈనె పదిహేడు వరకు లాక్‌ డౌన్‌ పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సడలింపు కారణంగా వసకూలీు, విద్యార్థు, పర్యాటకు వారి స్వస్థలాకు వెళ్లేందుకు అవకాశం ఏర్పడిరది. పరిమిత సంఖ్యలో ప్రయాణికు వాహనాు తిరిగే అవకాశం కలిగింది. రాష్ట్రాకు ప్రధాన ఆదాయ వనరుగా మారిన మద్యం షాపును తెరుచుకోవచ్చని చెప్పింది. యాభై మందికి మించకుండా వివాహ కార్యక్రమాు, ఇరవై మందికి మించకుండా అంత్యక్రియు నిర్వహించేలా కేంద్ర ప్రభుత్వం సడలింపు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత మూడు రోజు నుండి రాష్ట్రవ్యాప్తంగా ‘జనంసాక్షి’ ప్రజాభిప్రాయాన్ని సేకరించింది. ఇందులో దాదాపు తొంబై శాతానికి పైగా ప్రజు లాక్‌ డౌన్‌ ను యథావిధిగా కొనసాగించాని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసు ప్రతీరోజు నమోదవుతుండటంతో పాటు యాక్టివ్‌ కేసు సంఖ్య కూడా ఘణనీయంగా ఉన్నందున ఎలాంటి సడలింపు ఇవ్వకూడదని ప్రజు భావిస్తున్నారు. ఒకవేళ సడలింపు ఇస్తే నె రోజుకు పైగా ఇంట్లోనే ఉంటున్న ప్రజు ఒకేసారి రోడ్డు విూదకు వచ్చే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఇదే నెలో రంజాన్‌ పండుగ ఉన్నందున మార్కెట్లు రద్దీగా మారే అవకాశం ఉందని, ఇలాంటి సమయంలో ప్రజను నియంత్రించడం పోలీసుకు కూడా కష్టమేనని చాలామంది అభిప్రాయపడ్డారు. ఇక ఒకవేళ వైన్‌ షాపును తెరిస్తే పూట గడవటానికే ఇబ్బంది పడుతున్న కుటుంబా పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉంది. ఇప్పటికే కక్కలేక మింగలేక బాధ పడుతున్న మధ్యతరగతి కుటుంబాు అటు ఆర్థికంగా, ఇటు భాంధావ్యా పరంగా బహీనమయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అన్నిటికీ మించి బహిరంగ ప్రదేశాల్లో భౌతిక దూరం పాటిచండం అసాధ్యం. పైస కన్నా ప్రజ ప్రాణాలే ముఖ్యమని ఇప్పటికే ప్రకటించిన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు అధ్యక్షతన జరగనున్న మంత్రిమండలి సమావేశంలో ప్రజాభిప్రాయం మేరకే నిర్ణయాు ఉంటాయని పువురు భావిస్తున్నారు.

తాజావార్తలు