మధ్యాహ్న భోజనం బిల్లులు రావడంలేదని సిపిఐ నాయకులకు మోర

శంకరపట్నం,ఆగస్టు 29 ( జనం సాక్షి )
కేశవపట్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఏడాదిన్నరగా మధ్యాహ్న భోజనం వండి పెడుతున్నామని బిల్లులు మాత్రం రావడంలేదని సిపిఎం మండల కార్యదర్శి పిట్టల సమ్మయ్య కు విన్నవించారు. కేశపట్నం పాఠశాలను సోమవారం సిపిఐ నాయకులు సందర్శించారు. మధ్యాహ్న భోజనం, సరుకులు అప్పులు చేసి కొనుటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజనం ఇన్చార్జి సమయానికి బియ్యం ఇవ్వడంలేదని ఉపాధ్యాయులు సైతం విద్యార్థులకు వండిన భోజనాన్ని తింటున్నారని ఆరోపించారు.కోడి గుడ్డు పెట్టే రోజు విద్యార్థుల సంఖ్య కంటే 20మంది ఉపాధ్యాయులకు ఉడకబెట్టి ఇస్తున్నారని తాము కోడిగుడ్ల బిల్లులను నష్టపోతున్నామని వివరించారు.మధ్యాహ్న భోజనం బిల్లులు చూపించాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలోమధ్యాహ్న భోజనం కమిటీ జిల్లా అధ్యక్షుడు బొజ్జ సాయిలు,తాడవేని రవి, లింగయ్య పాల్గొన్నారు.

తాజావార్తలు