మధ్యాహ్న భోజనం వికటించినట్లు విద్యార్థుల తల్లి తండ్రుల ఆరోపణ
ఆరోపణలు అవాస్తవం
మండల విద్యాధికారి
ఎల్లారెడ్డి:ఆగస్టు 19 (జనం సాక్షి)
ఎల్లారెడ్డి పట్టణంలో గురువారం గాంధీ నగర్ కాలనీ లో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల లో మధ్యాహ్న భోజనం తిన్న నలుగురు విద్యార్థుల కు వాంతులు విరోచనాలు అయ్యాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపణలు చేశారు. అది గమనించిన ఉపాధ్యాయురాలు వెంటనే పిల్లల తల్లి తండ్రులను పిలిపించారు. పిల్లలకు తీవ్ర జ్వరం, వాంతులు, విరోచనాలు అయ్యి తీవ్ర అవస్థలకు గురయ్యారని పిల్లల తల్లిదండ్రులు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు వెల్లి నట్లు తెలిపారు. అక్కడ వైద్యులు పరీక్షలు జరిపి పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయిందని డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
మండల విద్యాధికారి వెంకటేశం కు వివరణ
కోరగా… ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఇంటి వద్ద ఉదయం భోజనాలు చేసి పాఠశాలకు వచ్చిన తర్వాత వాంతులు విరోచనాలు మొదలయ్యాయని అన్నారు. మధ్యాహ్న భోజనం కన్నా ముందే పిల్లలకు వాంతులు విరోచనాలు అయ్యాయని తెలిపారు.