మధ్యాహ్న భోజన ఏజెన్సీల సంఘం
6న కలెక్ట్రేట్ ఎదుట ధర్నా
నిజామాబాద్, ఆగస్టు 2 : ఆంధ్రప్రదేశ్ జిల్లా మధ్యాహ్న భోజన ఏజెన్సీల కార్మిక సంఘం (సిఐటియు) ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ఈ నెల 6వ తేదీన ధర్నా నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి టి.చక్రపాణి వివరించారు. గురువారం నగరంలోని సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిజామాబాద్ జిల్లలో 36 మండలాల్లో సుమారు 6వేల మంది ఏజెన్సీ నిర్వాహకులు పని చేస్తున్నారని, ప్రభు త్వం కార్మికుల పట్ల నిరంకుశత్వంగా వ్యవహరిస్తుందన్నారు. మధ్యాహ్న భోజన పథకంపై ప్రభుత్వం బడ్జెట్ కోత విధిస్తూ నాణ్యమైన ఆహారాన్ని అందించాలని కార్మికులను మానసిక ఆందోళనకు గురి చేస్తున్నాయని ఆవేద న వ్యక్తం చేశారు. కార్మికులతో వెట్టిచాకిరి చేయిస్తూ వారికి సరైన మౌలిక సదుపాయాలు కల్పించకుండా, నాణ్య మైన ఆహారాన్ని అందించకపో వడంలో కార్మికులే కారణమని నిందారోపణ చేస్తున్నారన్నారు. కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వం మొండి వైఖరితో వ్యవహరిస్తూ మధ్యాహ్న భోజన పథకాన్ని స్వచ్చంద సంస్థలకు అప్పగించి, ప్రభుత్వం చేతులు దులుపుకోవాలని ప్రయత్నిస్తుంద న్నారు. కార్మికులకు గుర్తింపు కార్డులు, కోడి గుడ్లకు అయ్యేఖర్చు ప్రభుత్వమే భరించాలని లేని యెడల గుడ్లను సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 6న ధర్నా చేపడుతున్న సందర్బంగా జిల్లా వ్యాప్తంగా వంటను నిలిపివేస్తూ నిరసన తెలుపుతామ న్నారు. జిల్లాలోని మధ్యాహ్న భోజన కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని ధర్నాను విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో సిఐటియు నగర కార్యదర్శి మల్యాల గోవర్ధన్ పాల్గొన్నారు.