మనం మురికి జీవనం గుడుపుతున్నాం

5

– స్వచ్ఛ హైదరాబాద్‌తో రూపురేఖలు మారుస్తాం

– చీకటి నుంచి వెలుగు వైపు పయనిస్తాం

– విస్తృతంగా హరితహారం

– సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌ మే 6 (జనంసాక్షి):  మనం ఎంత నాగరికులమని అనుకుంటున్నామో అంత అనాగరికంగా బతుకుతున్నామని మురికి జీవనం గడుపుతున్నామని    , ఈ దౌర్భాగ్యం నుంచి బయటపడాలని సిఎం కెసిఆం పిలుపునిచ్చారు. మనం తింటున్న కూరగాయలు, కొంటున్న మటన్‌ చికెన్‌ అంతా అపరిశుభ్ర వాతావరణం నుంచే తీసుకుంటున్నామని అన్నారు. మనం ఇవాళ చెత్తలో మురికిలో పెట్టి అమ్ముతోన్న కూరగాయలు, మాంసం కొంటోన్న దుస్థితిలో ఉన్నామని చెత్తా చెదారంలో జీవిస్తున్నామని తెలిపారు. ఇలాంటి పరిస్థితి పోవాలని అన్నారు. ఇందు కోసం మనమంతా నగరాన్ని పరిశుభ్ర నగరంగా మార్చుకోవాలని అన్నారు. సరైన కూరగాయల మార్కెట్లు, మాంసం మార్కెట్లు ఉండాలన్నారు. ప్రజల్లో ఉన్న సంఘటిత శక్తితో స్వచ్ఛ హైదరాబా’ను తయారు చేసుకుందామని పిలుపునిచ్చారు.  ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వక్చ తెలంగాణ, స్వక్చ హైదరాబా’ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుందామని సీఎం కకెసిఆం  పిలుపునిచ్చారు. బుధవారం  నోవాటెల్‌ ¬టల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ప్రసంగిస్తూ.. స్వచ్ఛ హైదరాబా’కు ప్రత్యేకంగా 200 కోట్లు జిహెకఎంసి ద్వారా కేటాయించామన్నారు. ఇందు కోసం మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. ప్రజల్లో ఉన్న సంఘటిత శక్తిని గుర్తించి వారిని ఇందులో భాగస్వామ్యం చేస్తే అద్భుత ఫలితాలు సాధిస్తామని అన్నారు. ఇందుకు తెలంగాణ ఉద్యమమే నిదర్శనమన్నారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభించిన రోజు తాను ఒక్కడినేనని, చుట్టూ చీకట్లను చీల్చుకుని ముందుకు సాగితే ప్రజలు ఎలా కదలి వచ్చారో ప్రత్యక్షంగా చూశామన్నారు. అభ్యుదయ వాదుల వల్లే ప్రపంచలో ఎన్నో మార్పులు చేసుకున్నాయని తెలిపారు. హైదరాబా’ నగరాన్ని అద్బుతమైన నగరంగా తీర్చి దిద్దేందుకు అవసరమైన అన్ని హంగులున్నాయని తెలిపారు. హైదారబా’కు 400 ఏళ్ల చరిత్ర ఉందని, ఎంతో ఖ్యాతి ఉందని,ఇదో కాస్మోపాలిటన్‌ సిటీ అని అన్నారు. దీనిని పరిశుద్దంగా తీర్చిదిద్దుకునే బాధ్యత ఇక్కడ ఉన్న ప్రజలందరిదని సిఎం కెసిఆం అన్నారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటే అంతర్జాతీయంగా లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చి తెలంగాణ యువతకు ఉద్యోగావకాశాలు ఏర్పడే అవకాశం ఉందని వివరించారు. హైదరాబా’ నగరం 600 కిలోవిూటర్ల విస్తీర్ణంలో ఉందని దీనిని కిలోవిూటరున్నర చొప్పున 400 విభాగాలు  చేశామని వివరించారు. ఒక్కో విభాగంలో ఒక్కో బృందం పర్యటిస్తుందని తెలిపారు. ఈ బృందం సభ్యులు వాళ్లు తిరిగే ప్రాంతంలో అక్కడి స్థానిక సమస్యలను తెలుసుకోవాలని కోరారు. తాగునీరు ఉందా? లైబ్రరీ ఉందా? స్మశాన వాటికలు ఉన్నాయా? తదితర అంశాలను పరిశీలించాలని కోరారు. పరిశీలన అనంతరం స్థానికులతో సమావేశమై సమస్యలపై చర్చించాలని సూచించారు. దీంతో స్థానికులకు అధికారులే తమ వద్దకు వచ్చారని సమస్యలు పరిష్కారమవుతాయనే ధీమా చేకూరుతుందని వివరించారు. వీరంతా బస్తీల అభివృద్దికి సమస్యలను గుర్తించి 50 లక్షల వరకు హావిూ ఇవ్వవచ్చన్నారు. హైదరాబా’ నగరానికి అద్భుతమైన హంగులు అద్దాల్సిన అవసరముందని  కేసీఆం అన్నారు.బాధ్యతలు తీసుకున్న వారు  స్వచ్ఛ హైదరాబా’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. స్వచ్ఛ హైదరాబా’ కార్యక్రమానికి ప్రతిఒక్కరు తరలిరావాలని కోరారు. భార’లో ఎక్కడా లేని విధంగా హైదరాబా’లో గుజరా’ గల్లీ,పార్సీగుట్ట లాంటివి ఎన్నో ఉన్నాయన్నారు.. ఒక భాగానికి తాను.. మరో భాగానికి గవర్నం బాధ్యత తీసుకుంటామని వివరించారు. ప్రజలు సంఘటితమైతే స్వచ్ఛ హైదరాబా’ సాధ్యమని పేర్కొన్నారు. తాను ఎక్కడికి వెళ్లినా పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని తెలిపారు. జంటనగరాల్లోని ప్రజాప్రతినిధులంతా స్వచ్ఛ హైదరాబా’లో పాల్గొంటారని చెప్పారు. ఉన్నతాధికారులు బస్తీల్లోకి వెళ్తే ప్రజల్లో మరింత చితన్యం పెరుగుతుందన్నారు. స్వచ్ఛ హైదరాబా’లో చెత్త తరలింపునకు 800 వాహనాలు సిద్ధం చేసినట్లు చెప్పారు. మొత్తంగా ఈ కార్యక్రమం ద్వారా హైదరాబా’ను సుందర నగరంగా తీర్చిదిద్దుకోబోతున్నామని తెలిపారు. నగరంలోని 2 లక్షల మందికి పేద ప్రజలకు డబుల్‌ బోరూమ్‌ కట్టిస్తామని ఉద్ఘాటించారు. మొన్న తాను ఐడీహెక కాలనీకి పోయినప్పుడు అక్కడి ప్రజల కళ్లలో కోటి రూపాయాల ఆనందం చూశానని చెప్పారు. అక్కడ ఇండ్లు నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. త్వరలోనే పేదలందరికీ ఇండ్లు ఇస్తామన్నారు. పేద ప్రజలు కూడా ఆత్మగౌరవంతో బతకాలనేది తమ లక్ష్యమని స్పష్టం చేశారు. చిల్లర రాజకీయాల కోసమో, ఓట్ల కోసమో తావిూ కార్యక్రమం చేపట్టడం లేదన్నారు. ప్రజల్లో చిన్న స్ఫూర్తి కలిగిస్తే.. ఇక రగిలిపోతారు అని పేర్కొన్నారు. హైదరాబా’ ఎటు పడితే అటు పెరిగిందని చెప్పారు. హైదరాబా’కు దేన్ని అతికించాలి.. దేన్ని విడిపించాలనే అంశంపై మాస్టం ప్లాన్‌ చేస్తున్నామని చెప్పారు. హెకఎండిఎ కమిషన్‌ శాలినీ మిశ్రాకు ఇదే విషయం చెప్పానన్నారు. అలాగే జూన్‌ నెలలో హరితహారం కార్యక్రమం ప్రారంభిస్తామని చెప్పారు. హైదరాబా’ నగరంలో 3 లక్షల మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ హరితహారాన్ని బాధ్యతగా తీసుకోవాలని కోరారు. ఎవరి ఇండ్ల వద్ద వారు మొక్కలు నాటుకోవాలి. ఇండ్ల వద్ద విశాలమైన స్థలం ఉంటే రెండు మూడు మొక్కలు నాటుకోవాలని సూచించారు. హరితహారం వల్ల మేలు జరుగుతుందే తప్ప నష్టం లేదన్నారు. హరితహారంపై కళాబృందాలు అవేంనెస్‌ కల్పిస్తాయన్నారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎంలు మహమూ’ ఆలీ, కడియం శ్రీహరి, ¬ంమంత్రి నాయిని నర్సింహరెడ్డి, మంత్రులు మహేందంరెడ్డి, జోగు రామన్న, మహేందంరెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి ఛైర్మన్‌ స్వామిగౌా, సీఎస్‌ రాజీవ్‌శర్మ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో స్వక్ఛ తెలంగాణ, స్వక్ఛ హైదరాబా’ పై ఓరియెంటేషన్‌ కార్యక్రమం నిర్వహించనున్నారు.