మనవద్దకు హార్వర్డ్ వర్సిటీ
న్యూయార్క్: ప్రముఖ అమెరికా విశ్వవిద్యాలయం హార్వర్డ్ త్వరలో భారత్లో కూడా తన కార్యక్రమాలను ప్రారంభించనుంది. ముంబై, చైనాలోని బీజింగ్, దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ తన అంతర్జాతీయ కార్యాలయాలను ఏర్పాటుచేయనుంది. ఈ మేరకు హార్వార్డ్ వర్సీటీకి చెందిన పత్రికలో పేర్కొంటూ వ్యాసాన్ని ప్రచురించింది. ఈ మూడు దేశాల్లోని కార్యాలయాలను తన పరిశోధనకు, అకడమిక్కు అవసరాలకు వినియోగించుకోనుంది.ఇప్పటికే భారత్తో ఈ విషయంలో చర్చలు జరుపుతున్నామని, ఈ వేసవిలో అనుమతి వచ్చేఅవకాశం ఉందని హార్వర్డ్ వర్సిటీ ప్రకటించింది. 2015 చివరిలోగా కేప్ టౌన్ నుంచి అనుమతి లభించే అవకాశం ఉందని, 2016 తొలి రోజుల్లో బీజింగ్లో అంతర్జాతీయ కార్యలయాలను ఏర్పాటుచేస్తామని ప్రకటించింది. వీటి ఏర్పాటు పూర్తయితే ప్రపంచ వ్యాప్తంగా మొత్తం కార్యాలయాల సంఖ్య16కు చేరుకుంటుంది.