మనసున్న మహారాజు మల్లిగారి రాజు.
జనగామ (జనం సాక్షి)అక్టోబర్16:జనగామ జిల్లాకేంద్రంలో పరిక్ష కేంద్రలలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా సమయానికి వెళ్లడానికి తన వంతు సహకారం అందించాలని ఉద్దేశంతో సమాజ సేవ భావంతో ఎప్పుడు ముందుండే మల్లిగారి రాజు జనగామలో గ్రూప్ వన్ పరీక్ష రాసే చాలా మంది అభ్యర్థులు పరీక్ష కేంద్రాల వివరాలు తెలియక అయోమయంలో ఉన్న సమయంలో అభ్యర్థుల బాధను గమనించి తను మంచి మనసుతో వెంటనే స్పందించి తన వాహనంలో చాలామందిని పరీక్ష కేంద్రాలకు సమయానికి చేరవేసి వారి కళ్ళల్లోని సంతోషాన్ని చూశారు,ఈ సందర్భంగా విద్యార్థులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు వారికి ప్రత్యేక అభినందనలతో ధన్యవాదాలు తెలిపినారు