మనసున్న మహారాజు సీఎం కేసీఆర్

గిరిజనులకు 10 % రిజర్వేషన్ ప్రకటన పట్ల హర్షం వ్యక్తం – దళిత బంధు తరహాలో గిరిజన బంధు ఇస్తానడం ఎంతో హర్షనీయం – తెలంగాణ సీఎం కెసిఆర్ చిత్ర పటానికి గిరిజన నాయకుల ఆధ్వర్యంలో పాలాభిషేకం
హుజూర్ నగర్ సెప్టెంబర్ 18 (జనం సాక్షి): మనసున్న మహారాజు తెలంగాణ సీఎం కేసీఆర్ అని, గిరిజనులకు 10 % రిజర్వేషన్ ప్రకటన పట్ల హుజూర్ నగర్ నియోజకవర్గ గిరిజన నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం హుజూర్ నగర్ కేంద్రం లో గల బంజారా భవన్ నందు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చిత్రపటానికి గిరిజన హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు నగేష్ రాథోడ్ ఆధ్వర్యంలో నియోజకవర్గ గిరిజన నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మట్టంపల్లి జడ్పీటీసీ బాణావత్ జగన్, ఎంపీపీ మూడవత్ పార్వతి కొండా నాయక్ లు మాట్లాడుతూ గిరిజన ప్రజల అభివృద్దే లక్ష్యంగా గిరిజన రిజర్వేషన్ 6శాతం నుండి 10 శాతానికి పెంపు, పోడు భూముల సమస్యల పరిష్కారం, గిరిజన బందు పథకం అమలుకు నిర్ణయించినందుకు గాను ముఖ్యమంత్రి కేసీఆర్ కి కృతజ్ఞతలు తెలుపుతూ పాలాభిషేకం చేయటం జరిగిందన్నారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలో బంజారా భవన్ నిర్మించడం, మఠంపల్లి మండలంలోని రైల్వే స్టేషన్ కు సంత్ సేవాలాల్ పేరు నామకరణం చేయడం ఎంతో గర్వించదగ్గ విషయమని వారు అన్నారు. గిరిజనుల చిరకాల కోరిక నెరవేర్చబోతున్న సీఎం కెసిఆర్ వెంటనే రిజర్వేషన్ జీవో విడుదల చేయాలనీ కోరారు. నిన్న జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజన లకు రిజర్వేషన్ గిరిజనులకు 10 % రిజర్వేషన్ ప్రకటించడంతో అదేవిధంగా పోడు భూముల సమస్యలకు 140 జీవో జారీ తో పాటు.. గిరిజన బందు అమలు చేస్తామని సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు అని అన్నారు. దళిత బంధు తరహాలో గిరిజన బంధు ఇస్తానడం ఎంతో హర్షనీయమని, యావత్ తెలంగాణ ఆదివాసీ గిరిజనులు కేసీఆర్ కి రుణపడి ఉంటామని అన్నారు. గిరిజన రిజర్వేషన్ జీవో విడుదల అయినా రోజు హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా భారీ స్థాయిలో కెసిఆర్ కి కృతజ్ఞత సభ నిర్వహించటకు గిరిజన పెద్దలు త్వరలో నిర్ణయం తీసుకుంటారని ఈ సందర్బంగా అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సేవాలాల్ ఉత్సవ కమిటీ కన్వినర్ బాణావత్ వెంకటేశ్వర్లు, తెరాస గరిడేపల్లి మండల అధ్యక్షులు జి. కృష్ణా నాయక్, మోహన్ రావ్ నాయక్, భూక్యా నాగరాజు నాయక్, మణికంఠ నాయక్, గిరిజన శక్తి జిల్లా కన్వీనర్ మధు నాయక్, తులసి రామ్ నాయక్, బాణావత్ సైదా నాయక్, రామావత్ రవీందర్ నాయక్, పిడమర్తి రాజు, పాండు నాయక్, శ్రీను నాయక్, నాగు నాయక్, ప్రేమ్ నాయక్, శ్రీను నాయక్, అడ్వకేట్ వెంకటేష్ నాయక్, మహేందర్ నాయక్, రాము నాయక్ తదితరులు పాల్గొన్నారు.