మన్నేరువాగులో మనిగి ఇద్దరి మృతి

ఖమ్మం : ఖమ్మం గ్రామీణ మండలం తీర్థాల జాతరలో అపశ్రుతి చోటుచేసుకుంది. శివరాత్రి సందర్భంగా నిన్న రాత్రి జాగరణ చేసి మున్నేరువాగులో స్నానానికి దిగిన ఇద్దరు మృతి చెందారు. వాగు లోతుగా ఉండటం, ఎలాంటి రక్షణ ఏర్పాట్లు లేకపోవడంతోనే ఈ ఘటన చోటుచేసుకుందని స్థానికులు ఆరోపించారు.