మన్మోహన్ సమర్థ ప్రధాని
పీఏపై ఆరోపణలను తిప్పి కొట్టండి సోనియా పిలుపు
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అభ్యర ఎంపిక బాధ్యత సోనియాకు అప్పజెప్తూ సీడబ్ల్యూసీ తీర్మానం
న్యూఢిల్లీ :ప్రధాని మన్మోహన్‌సింగ్, యుపిఏ ప్రభుత్వం పై విపక్షాలు, అన్నా హజారే బృందం చేస్తున్న ఆరోపణలపై కాంగ్రెస్ అధినేత్రి, యుపిఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ మండిపడ్డారు. వారు చేస్తున్న ఆరోపణాలన్ని నిరాధారమైనవని అన్నారు. సోమవారం ఇక్కడ జరిగిన సిడబ్ల్యుసి సమావేశంలో ఆమె ప్రారంభో పన్యాసం చేశారు. విపక్షాలు, ప్రధాని, యుపిఏ చేస్తున్న దాడిని సమర్థంగా తిప్పికొట్టాలని ఆమె పిలుపునిచ్చారు. ”ప్రజా స్వామ్యంలో ప్రతిపక్షం క్రియాశీల విధి నిర్వహిం చాలి అయితే కనీస మర్యాద విస్మరించి యుపీఏ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తున్నారు” అని పేర్కొన్నారు. ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు సంపూర్ణ సంఘీభావం ప్రకటించారు. ప్రజాస్వామ్యంలో విమర్శలు చేసే హక్కు ఉన్నప్పటికీ విపక్షాలు నిరాధార ఆరోపణలు చేయడ తగదని ఆమె అన్నారు. విపక్షాలు, పౌర సమాజం చేస్తున్న విమర్శలను ధీటుగా ఎదుర్కొవాలని తప్పిదాన్ని ఎత్తిచూపడంతోనే తాము ఆరోపణలు చేశామే తప్ప వ్యక్తిగతంగా మన్మోహన్‌తో తమకెలాంటి వ్యతిరేకత లేదని అన్నా హజారే స్పష్టం చేశారు. వాస్తవాలను మరుగుపర్చే ప్రయత్నాలను సోనియాగాంధీ చేయడం శోచనీయమని ఆయన పేర్కొన్నారుప్రధానిని దోషిగా నిలబెట్టేందుకు తమ వద్ద ఆధారాలున్నాయని అన్నా హజారే స్పష్టం చేశారు.