మన ఆర్మీ.. అమెరికా నియంత్రణలో ??

 మన ఆర్మీ, మిలిటరీ ఉత్పత్తులు అమెరికా నియంత్రణలోకి వెళ్లిపోయే ప్రమాదం పొంచి ఉన్నదని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆందోళన వ్యక్తం చేశారు. ‘మేజర్‌ డిఫెన్స్‌ పార్టనర్‌’ పేరిట రూపొందించిన నివేదికని అమెరికా ప్రభుత్వం సెనేట్‌ ముందు ఉంచిందని అక్కడ ఆమోదం లభిస్తే, మన సైన్యంపై అమెరికాకు ప్రత్యక్ష పర్యవేక్షణ అధికారం లభిస్తుందని వివరించారు. ఎఫ్‌వై 201yechurysitaram-k90f-621x414livemint7 నేషనల్‌ డిఫెన్స్‌ ఆథరైజేషన్‌ యాక్ట్‌ (ఎన్‌డీఏఏ)లో భాగంగా తయారుచేసిన ఈ నివేదికలో..మిలిటరీ రంగంలో తన జూనియర్‌ భాగస్వామిగా.. భారతను అమెరికా పేర్కొన్నదని ఏచూరి తెలిపారు. ఇంత ముఖ్యమైన అంశంపై మోదీ ప్రభుత్వం పార్లమెంటులో కనీస ప్రకటన కూడా చేయలేదంటూ ప్రధానికి మంగళవారం ఆయన ఘాటైన లేఖ రాశారు. ‘‘నివేదికను బట్టి, మనదేశం అమెరికా పక్షం తీసుకొన్నట్టు తెలుస్తుంది. అయితే, దానికోసం తనవైపు నుంచి భారత ఏఏ హామీలు ఇచ్చిం దనేది మాత్రం తెలియడం లేదు’’ అని ఏచూరి పేర్కొన్నారు. దక్షిణాసియా, ఇండో ఆసియా పసి ఫిక్‌ ప్రాంతాల్లో అమెరికా ప్రయోజనాల పరిరక్షణ కోసం భారత నుంచి రక్షణ, భద్రతాపరమైన సహకారాన్ని పొందనున్నట్టు నివేదికలో స్పష్టంగా ఉందన్నారు. ‘‘ఎఫ్‌వై 2017 లోని 1292 సెక్షన్‌, (ఈ) పేరాలో.. భారత కొనుగోలుచేసే రక్షణ పరికరాలు, మిలిటరీ సేవలు, సాంకేతికత తదితర మిలిటరీ ఉత్పత్తుల పరిస్థితిని, తదనుగుణ ఒప్పందాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించే వ్యవస్థలను ఏర్పాటు చేయాలి. ఇదే సెక్షన్‌(ఎఫ్‌) పేరాలో.. ఇకముందు మిలిటరీ ఉత్పత్తుల సేకరణ, విక్రయ లావాదేవీలను అమెరికా కంపెనీలతోనే భారత సాగిస్తుంది’’ అని పేర్కొన్నారు.