మన ఊరు మనబడి నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి.

అదనపు కలెక్టర్ మను చౌదరి.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్ 2(జనంసాక్షి):
నాగర్ కర్నూల్ జిల్లాలో మన ఊరు మనబడి కార్యక్రమం కింద  పాఠశాలలో చేపట్టిన పనులను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ మను చౌదరి,సంబంధిత ఇంజనీరింగ్ అదికారులను ఆదేశించారు.
 ప్రతి మండలానికి 2 పాఠశాలల చొప్పున 40 పాఠశాలల నిర్మాణా పనులపై ప్రత్యేక దృష్టి సారించి, దసరా నాటికి 40 పాఠశాలలను ప్రారంభించేందుకు  పనుల్లో వేగం పెంచాలని అదనపు కలెక్టర్  సంబంధిత అధికారులను ఆదేశించారు.
మన ఊరు మన బడి నిర్మాణ పనుల పురోగతిపై అదనపు కలెక్టర్ శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఇంజనీరింగ్ మరియు విద్యాశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన ఊరు మనబడి నిర్మాణ పనులకు జిల్లాకు మరో మూడు కోట్ల రూపాయలు విడుదల అయ్యాయని, నిర్మాణ పనుల పురోగతి వారిగా నిధులు విడుదల చేస్తామని తెలిపారు.మొదటి విడతలో 290 పాఠశాలలు ఎంపిక కాగా అందులో 66 పాఠశాలల్లో 30 లక్షలకు పైగా నిధులు ఖర్చు చేయాల్సిన పాఠశాలలకు వెంటనే ఆన్లైన్ టెండర్లను పిలవాలని ఆదేశించారు. 170 పాఠశాలల్లో పనులు ప్రారంభమయ్యాయన్నారు.ప్రారంభమైన పనులను వెంటనే పూర్తి చేసేలా ప్రతి మండలానికి 10 లక్షల చొప్పున టార్గెట్ విధించారు.పనులవారీగా ఏం బుక్ లను సబ్మిట్ చేసి ఆన్లైన్ జనరేట్ చేసిన వారికి నిధులు విడుదల చేస్తామని తెలిపారు.
గతంలో విడుదల చేసిన 2 కోట్ల రూపాయల నిధుల పనుల యం బుక్ ల రికార్డుల వారీగా 54 లక్షల రూపాయల పనుల వివరాలను ఆన్లైన్లో పొందుపరచడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.పనుల వివరాలను ఎప్పటికప్పుడు యం బుక్ లో రికార్డ్ లను ఈ నెల పదో తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశించారు.మన ఊరు మనబడి కి నిధుల కొరత లేదని పనులను వేగం చేయాలని ఆదేశించారు.త్వరితగతిన పాఠశాలలో చేపడుతున్న పనుల ఇన్ ఫుట్ డాటా ఎంట్రీ పూర్తిచేయాలని
ఆదేశించారు.ఆర్ అండ్ బి ఇంజనీరింగ్ అధికారులు చేపట్టిన పనులు వేగవంతం అయ్యే దిశగా ఇతర శాఖల ఇంజనీరింగ్ అధికారులతో కోఆర్డినేట్ చేసుకోవాలని అదనపు కలెక్టర్ తెలిపారు.ఇంకా పనులు ప్రారంభం కానీ పాఠశాలల పనులను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో డీఈవో గోవిందరాజులు, ఈఈపిఆర్ దామోదర్ రావు, ఈఈ  ఇడబ్ల్యూ ఐ డి సి రామచంద్ర రావు, ఆర్ అండ్ బి ఈఈ భాస్కరరావు డిప్యూటీ ఇంజనీర్లు రమాదేవి, దుర్గాప్రసాద్ ప్రతాప్, సెక్టోరల్ అధికారి వెంకటయ్య, ఈడియం నరేష్, టెక్నికల్ సిబ్బంది రఘు, పవన్, మండల విద్యాధికారులు ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.