మన సానియాకు ఖేల్‌రత్న

2

ఢిల్లీ  ఆగష్టు 29 (జనంసాక్షి):

భారత మహిళా టెన్నిస్‌ కు అనధికార బ్రాండ్‌ అంబాసిడర్‌ గా ఉన్న సానియా విూర్జాని కీర్తి కిరీటంలో మరో కిలికితు రాయి చేరింది. కేంద్ర ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక రాజీవ్‌ ఖేల్‌ రత్న అవార్డును సానియా విూర్జా శనివారం అందుకున్నారు. ఇవాళ సాయంత్రం ఢిల్లీ లో జరిగిన జాతీయ క్రీడా దినోత్సవ కార్యక్రమంలోరాష్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చేతుల విూదుగా సానియా ఖేల్‌ రత్న పురస్కారాన్ని అందుకుంది.దీంతో పేస్‌ తర్వాత ఈ అవార్డు అందుకున్న రెండో టెన్నిస్‌ ప్లేయర్‌ గా ఆమె అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. సానియా కెరీర్‌లో మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో మూడు, డబుల్స్‌లో ఒక గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ ను కైవసం చేసుకుంది. గత ఏడాది కాలంగా అంతర్జాతీయ సర్క్యూట్‌లో హవా కొనసాగిస్తోంది. 2014 చివర్లో డబ్ల్యూటీఏ ఫైనల్స్‌ నెగ్గి సంచలనం సృష్టించిన విూర్జా…ఈ ఏడాది ఏప్రిల్‌ రెండో వారంలో వరల్డ్‌ నంబర్‌ వన్‌ ర్యాంక్‌కు కూడా చేరుకొని అందనంత ఎత్తులో నిలిచింది.గత ఏడాది బ్యాడ్మింటన్‌లో టాప్‌ ఆటగాడు లిన్‌ డాన్‌ను ఓడించి చైనా ఓపెన్‌ గ్రాండ్‌ప్రి గోల్డ్‌ టైటిల్‌ గెలుచుకున్న కిదాంబి శ్రీకాంత్‌, స్కేటింగ్‌లో ఎలాంటి ప్రోత్సాహం దక్కకపోయినా కఠోర శ్రమతో గత ఏడాది ప్రపంచ చాంపియన్‌ షిప్‌ లో స్వర్ణం సాధించిన అనూప్‌ యామాలు అర్జున అవార్డులు గెలుచుకున్న వారిలో ఉన్నారు.స్పూర్తి నింపింది: సానియా    రాజీవ్‌ ఖేల్‌ రత్న అందుకోవడం గొప్ప గౌరవం అని సానియా విూర్జా స్పందించింది. ఈ అవార్డు తనలో ఎంతో స్పూర్తి నింపిందని అన్నారు.