మన హైదరాబాద్‌లో మొబైల్ తయారీ
హైదరాబాద్,జూన్2(జనంసాక్షి) : మన రాజధాని హైదరాబాద్‌లో మొబైల్ హార్డ్‌వేర్ పరిశ్రమను ఏర్పాటు చేయనున్నట్టు సీఎం కేసీఆర్ తెలిపారు. మంగళవారం సీఎం కెసిఆర్‌తో ఇండియన్ సెల్యూలార్ అసోసియేషన్ భేటీ అయింది. రాష్ట్రంలో మొబైల్ తయారీ పరిశ్రమల సముదాయం ఏర్పాటు అంశంపై ప్రభుత్వం,మొబైల్ యజమానుల మధ్య సూతప్రాయ అంగీకారం కుదిరింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ దేశంలో మొబైల్ తయారీ రంగంలో హైదరాబాద్‌ను అగ్రగామిగా నిలబెడదామని పిలుపునిచ్చారు. పరిశ్రమల ఏర్పాటుకు సమగ్ర నివేదిక ఇవ్వాలని పారిశ్రామిక వేత్తలను విజ్ఞప్తి చేశారు. పరిశ్రమలకు అవసరమైన స్థలం, సదుపాయాలు కల్పించాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీచేశారు. ఈ సమావేశానికి సెల్యూలార్ జాతీయ అధ్యక్షుడు పంకజ్ మహీంద్ర, మొబైల్ పరిశ్రమల యజమానులు హాజరయ్యారు.