మమతా భారీ ర్యాలీ

 పెద్ద నోట్ల రద్దును వ్యతిరేకిస్తూ తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఆధ్వర్యంలో ఇవాళ విపక్షాలు భారీ ర్యాలీ నిర్వహించాయి. పార్లమెంట్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ భారీ ర్యాలీలో శివసేన, నేషనల్ కాన్ఫరెన్స్, ఆప్ నేతలు పాల్గొన్నారు. కాగా, మోదీ ప్రభుత్వం రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. దీనిని వ్యతిరేకిస్తూ మమతా ప్రతిపక్షాల నేతలను ఏకం చేసిన విషయం తెలిసిందే. ఈమేరకు ఇవాళ ర్యాలీ కొనసాగింది. కాంగ్రెస్ తో పాటు సీపీఎం పార్టీలు ర్యాలీలో పాల్గొనలేదు. ఆర్థిక విపత్తు నుంచి ప్రజలను కాపాడాలని రాష్ట్రపతిని కోరనున్నట్లు దీదీ తెలిపారు.1x-1