మయన్మార్‌లో ఘోరం..

` నిరాశ్రయుల క్యాంప్‌పై శతఘ్నిదాడి..
` 29 మంది మృతి
` 44 మందికి తీవ్రగాయాలు
` మృతుల్లో 11 మంది చిన్నారులు
బర్మా (జనంసాక్షి):మయన్మార్‌ లో ఘోరం చోటు చేసుకొంది. లైజా అనే ప్రదేశంలో సోమవారం అర్ధరాత్రి నిరాశ్రయులు ఉంటున్న ఓ క్యాంప్‌పై శతఘ్ని దాడి జరిగింది.
ఈ ఘటనలో దాదాపు 29 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 44 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 11 మంది చిన్నారులు ఉన్నారు. ఈ దాడి జరిగిన ప్రదేశం కచిన్‌ ఇండిపెండెన్స్‌ ఆర్గనైజేషన్‌ అనే వేర్పాటువాద గ్రూపు ఆధీనంలో ఉంది. తాజా దాడిలో చనిపోయిన వారిలో చిన్నారులు కూడా ఉన్నారు. ఈ దాడి వెనుక సైనిక హస్తం ఉందనే అనుమానాలున్నాయి. ఇదే నిజమైతే గత కొన్నేళ్లలో కచిన్‌ వేర్పాటువాదులపై చేసిన అతిపెద్ద దాడి ఇదే అవుతుంది.2021లో మయన్మార్‌ పౌర ప్రభుత్వాన్ని కూలదోసి సైన్యం అధికారం దక్కించుకొంది. నాటి నుంచి ప్రత్యర్థులను అణచివేయడానికి ఆర్మీ వైమానిక దాడులు చేస్తోంది. అయితే తాజా దాడి వెనుక తమ హస్తం లేదని సైనిక ప్రతినిధి మేజర్‌ జనరల్‌ రaా మిన్‌ తున్‌ వివరణ ఇచ్చారు. ఆ ప్రదేశంలో సైన్యం ఎటువంటి ఆపరేషన్లు చేపట్టలేదన్నారు. బహుశ వేర్పాటువాదుల మందుగుండు నిల్వలు పేలి ప్రమాదం జరిగిఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. కచిన్‌ వేర్పాటువాద సంస్థ ప్రధాన కార్యాలయానికి ఈ దాడి జరిగిన ప్రదేశం కేవలం రెండు కిలోవిూటర్ల దూరంలోనే ఉంది. గత కొన్నేళ్లుగా కచిన్‌ వేర్పాటువాదులు మయన్మార్‌ సైనిక ప్రభుత్వంతో పోరాడుతున్నారు. దీంతో వీరికి సామాన్యప్రజల్లో వీరికి మద్దతు పెరిగింది. మయన్మార్‌లోని అత్యంత శక్తిమంతమైన వేర్పాటువాద గ్రూపుల్లో కచిన్‌ నేషనల్‌ ఆర్మీ ఒకటి.తాజా దాడిపై మయన్మార్‌లోని ఐరాస కార్యాలయం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ‘’ఐడీపీ క్యాంప్‌లు శరణార్థులకు నిలయాలు. అవి ఎక్కడ ఉన్నాకానీ.. వాటిని లక్ష్యంగా చేసుకోకూడదు’’ అని పేర్కొంది. కచిన్‌ రాష్ట్రంలో గతేడాది మయన్మార్‌ సైన్యం జరిపిన దాడిలో 60 మంది చనిపోయిన విషయం తెలిసిందే.