మయన్మార్ మారణకాండపై వెల్లువెత్తిన నిరసన
కరీంనగర్, జూలై 28 (జనంసాక్షి) : మయాన్మార్‌లో ముస్లింలపై జరుగుతున్న మారణకాండను ఆపాలని కోరుతు మూవ్‌మెంట్ ఫర్ పీస్ జస్టీస్, ఎస్‌ఐవో ఆధ్వర్యంలో నగరంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. మానవత్వం లేకుండా మయన్మార్‌లోని సైనిక నియంతలు ముస్లీంలపై దాడులు చేసి దారుణంగా హతమారుస్తున్నారనీ, వారికి రక్షణ కల్పించేవారే కరవయ్యారనీ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మానవహక్కుల సంఘాలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. మానవత్వాన్ని కాపాడాలని, ముస్లింలను రక్షించాలంటూ నినాదాలు చేశారు. భారత్ దీనిపై ఎందుకు స్పందించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రపంచ దేశాలు, మానవహక్కుల సంఘాలు, భారత ప్రభుత్వం స్పందించి మయన్మార్‌లో జరుగుతున్న దారుణ మారణకాండను ఆపాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీజే సభ్యులు, ఎస్‌ఐవో కార్యకర్తలు పాల్గొన్నారు.