మరమ్మత్తులకు నోచుకోని నిరంజన్ చెరువు.

మూడు మామిళ్ల మత్తడి.
వృధాగా పోతున్న చెరువు నీరూ
అధికారులపై.రైతన్నల ఆగ్రహం
జనం సాక్షి సైదాపూర్..మండలంలోని
ఎగ్లాస్పూరుగ్రామపంచాయతీ పరిధిలో ఉన్నటువంటి మూడు మామిళ్ల మత్తడి గత నాలుగు సంవత్సరాల నుండి చెరువుకు అనేక గండ్లు పడి మత్తడి పాడైన మరమ్మత్తులకు నోచుకోలేదు అధికారులకు ప్రజాప్రతిని దృష్టికి ఎన్నిసార్లు తీసుకుపోయిన ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం వ్యక్తం చేస్తున్నారు చెరువుపారకం. ఆయకట్టు రైతులకు జీవనాధారం అని రైతులు తెలిపారు గత నాలుగు సంవత్సరాల నుండి ఈ చెరువును మరమ్మత్తులకు నోచుకోక ఏండ్లుగడుస్తున్నాఅని.రైతులు తెలిపారు నీటిపారుల శాఖ అధికారులకు స్థానిక రైతులు ఎన్నిసార్ల ఫిర్యాదు చేసిన వచ్చి చూసుపోవడమే తప్పించి ఇప్పటివరకు కూడా పనులు చేయలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా అధికారులు స్పందించి మరమ్మత్తులు చేయాలని వారు కోరుతున్నారు మూడు మామిళ్ల మత్తడి తెగిపోయి నాలుగు సంవత్సరాలు అవుతుంది ఇప్పటివరకు ఎలాంటి మరమతులు చేయలేదు దానికింద చెరువుపారకం.దాదాపు 400 ఎకరాల సాగు భూమి కలదు దానికి అనుబంధంగా నిరంజన్ చెరువు కలదు దీని ద్వారానే ఆ చెరువులకు వరద పోవును దీనిని ఇరిగేషన్ ఎస్సీ గారికి మరియు ఈ. ఈ. గారికి దృష్టికి తీసుకుపోగా వారు వచ్చి సర్వే చేసి పోయినారు ఇంతవరకు ఎలాంటి నిమరమ్మతులు చేయలేదు వర్షము నీరు వృధాగా పోవుచున్నది కావున వెంటనే మరమ్మతులు చేయించి రైతులను ఆదుకోవాలని కోరుచున్నాము

తాజావార్తలు