మరుగుదొడ్డిని వాడుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి-ఎంపీడీవో పద్మావతి

సైదాపూర్ జనం సాక్షి నవంబర్19మరుగుదొడ్డి నిర్మించుకున్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వాడుకోని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఎంపీడీవో పద్మావతి కోరారు. శనివారం మండలంలోని లస్మన్నపల్లి గ్రామంలో ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కాయిత రాములు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ… ప్రతి ఒక్కరూ మరుగుదొడ్డి వాడకాన్ని పెంచి బహిరంగ మలవిసర్జనను నివారించాలని అన్నారు. మరుగుదొడ్లను వాడడం వల్లే మహిళల ఆత్మగౌరవం పెరుగుతుందని తెలిపారు. వ్యక్తిగత పరిశుభ్రత కోసం మరుగుదొడ్డి వాడాలని అలాగే పరిసరాల పరిశుభ్రతను కూడా కాపాడాలని పేర్కొన్నారు. ప్లాస్టిక్ను నివారించి భవిష్యత్ తరాలను కాపాడుకోవాలని తెలిపారు. మహిళలు గ్రామంలో తడి ,పొడి చెత్తను వేరు చేసి గ్రామపంచాయతీ సిబ్బందికి అందించాలని అన్నారు .పచ్చదనం, పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. అనంతరం ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీలక్ష్మి, వార్డు సభ్యులు మాతంగి వెంకటయ్య, తలారి శ్రావణి ,కో ఆప్షన్ సభ్యులు కొట్టే వెంకటరెడ్డి ,అంగన్వాడి టీచర్, స్వరాజ్యం వివో ఏ శ్రీలత, ఆశా కార్యకర్త నిర్మల, మహిళలు పాల్గొన్నారు.