మరో ముగ్గురు బందీలు విడుదల

` రెడ్‌క్రాస్‌ సంస్థకు అప్పగించిన హమాస్‌
గాజా(జనంసాక్షి):గాజా కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా మరో ముగ్గురు బందీలను విడుదల చేసి శనివారం హమాస్‌ రెడ్‌క్రాస్‌కు అప్పగించింది. సాగుయ్‌ డెకెల్‌ చెన్‌ (36), అలెగ్జాండర్‌ ట్రుఫనోవ్‌ (29), jైుర్‌ హార్న్‌(46)లను విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. కాల్పుల విరమణను ఇజ్రాయెల్‌ ఉల్లంఘిస్తుందని ఆరోపిస్తూ.. బందీల విడుదలను ఆలస్యం చేస్తున్నట్లు ఇటీవల హమాస్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (ఆనీనిజీశ్రీట ుతీబీఎజూ)తో సహా ఇజ్రాయెల్‌ తీవ్రంగా పరిగణించింది. ఈ వారాంతంలో తమ బందీలను విడుదల చేయకపోతే.. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ బెదిరింపులకు తలొగ్గిన మిలిటెంట్‌ సంస్థ బందీల విడుదలకు అంగీకరించింది. ఇక, దీనికి ప్రతిగా ఇజ్రాయెల్‌ 369 మంది పాలస్తీనియన్లను విడుదల చేసింది. ఖతర్‌, ఈజిప్టు మధ్యవర్తిత్వంతో గత నెల ఇజ్రాయెల్‌` హమాస్‌ ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. ఇందులో భాగంగా.. హమాస్‌ తమ చెరలోని 94 మంది బందీల్లో 33 మంది బందీలను విడుదల చేయనుంది. ప్రతిగా దాదాపు 1700 మందికి పైగా పాలస్తీనీయులకు తమ జైళ్ల నుంచి ఇజ్రాయెల్‌ విముక్తి కల్పించనుంది. ఈ ఒప్పందంలో భాగంగా ఇప్పటివరకు పలు దఫాలుగా 21 మంది బందీలను మిలిటెంట్‌ సంస్థ విడుదల చేయగా, 730 మంది పాలస్తీనా ఖైదీలకు టెల్‌అవీవ్‌ విముక్తి కల్పించింది.