మరో 13,300 మందికి
మరో 13,300 మందికి….
నగరంలో రెండో విడత డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ అట్టహాసంగా సాగింది. గ్రేటర్ వ్యాప్తంగా గురువారం తొమ్మిది ప్రాంతాల్లో జరిగిన ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రులు, నగర మేయర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్లు పాల్గొని 13,300మంది లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలను అందజేశారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దుండిగల్‌లో మంత్రి కేటీఆర్, పటాన్‌చెరు నియోజకవర్గంలోని కొల్లూరు-2లో మంత్రి హరీశ్‌రావు, చర్లపల్లిలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని పెద్ద అంబర్‌పేట మున్సిపాలిటీ హట్టిగూడలో మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, తట్టి అన్నారంలో మంత్రి మహమూద్ అలీ, మహేశ్వరం నియోజకవర్గంలోని మన్‌సాన్‌పల్లిలో మంత్రి సబితాఇంద్రారెడ్డి, జవహర్‌నగర్‌లో మంత్రి మల్లారెడ్డి, మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ మండల పరిధిలోని ప్రతాప సింగారంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, తిమ్మాయిగూడెంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇండ్ల పట్టాలను స్థానిక ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్ పార్టీ ముఖ్య నేతలతో కలిసి పంపిణీ చేశారు. ఇప్పటివరకు 25వేల ఇండ్ల పట్టాల పంపిణీ పూర్తి కాగా, మరో 75వేల ఇండ్లను దశల వారీగా అందజేయనున్నారు. అయితే ఇన్నాళ్లు డబుల్ బెడ్రూం ఇండ్ల పేరిట రాజకీయ కుప్పిగంతులు వేసిన ప్రతిపక్షాలకు నోరు లేకుండా పోయిందని పలువురు మంత్రులు వ్యాఖ్యానించారు.
- రెండో విడత డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ 25వేలు పూర్తి.. త్వరలో మరో 75 వేలు
- ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా
- మానవ ప్రేమయం లేకుండా.. ర్యాండమైజేషన్‌లో లబ్ధిదారుల ఎంపిక
- డబుల్ ఇండ్ల పథకం నిరంతర ప్రక్రియ
- ఇండ్లు అమ్ముకుంటే చట్టపరంగా చర్యలు
- ఎవరూ ఆందోళన చెందొద్దు..
- గృహలక్ష్మి పథకం కింద రూ.3 లక్షలు అందజేస్తాం
- ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టిస్తున్న ప్రతిపక్షాలు
- కాంగ్రెస్ మోసపూరిత హామీలను నమ్మొద్దు
- ప్రతిపక్షాలకు బుద్ధిచెప్పాలి..కేసీఆర్‌కు అండగా నిలువాలి
- అట్టహాసంగా రెండో విడత పంపిణీ.. తొమ్మిది ప్రాంతాల్లో డబుల్ ఇండ్ల పండుగ
- పట్టాలు అందుకున్న ఆనందంలో లబ్ధిదారులు
- పత్రాలు పంపిణీ చేసిన మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, మహమూద్ అలీ, సబితారెడ్డి, మల్లారెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, మేయర్ విజయలక్ష్మి