మర్యాల గ్రామంలో 25 లక్షల ఎమ్మెల్సీ నిధులతో హెల్త్ సెంటర్ శంకుస్థాపన

బొమ్మలరామారం, జనం సాక్షి.
ప్రజల ఆరోగ్యానికి తెలంగాణ రాష్ట్ర
ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులను కేటాయించి ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తుందని జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి అన్నారు. బొమ్మలరామారం మండలం మర్యాల గ్రామంలో ఎమ్మెల్సీ ప్రత్యేక నిధులనుండి గ్రామంలో 25 లక్షల రూపాయలతో నూతన పబ్లిక్ హెల్త్ సెంటర్ నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జెడ్పి చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి, గ్రామ సర్పంచ్ కుర్మిండ్ల దామోదర్ గౌడ్, పిఎసిఎస్ చైర్మన్
గుదే బాలనర్సింహ యం.పీ. టీ.సీ అనిత కావ్యలు ఈశ్వర్ గౌడ్ పాల్గొని శంకుస్థాపన చేశారు. సందర్భంగా ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఇప్పటివరకు జిల్లాలోని వివిధ గ్రామాలలో 60 కమ్యూనిటీ , అంగన్వాడి భవనాలు, పబ్లిక్ హెల్త్ సెంటర్లను నిర్మాణానికి నిధులు కేటాయించానని అన్నారు.
1960 సంవత్సరంలో ఇదే గ్రామంలో ఉపాధ్యాయ వృత్తిగా పనిచేసానని గుర్తు చేశారు. నాడు పాఠశాలలో ప్రాథమిక స్థాయి ఉన్న పాఠశాలను ఉన్నత పాఠశాలగా తీర్చిదిద్దానని మర్యాల గ్రామానికి తనకు ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. గ్రామ సర్పంచులు అభివృద్ధిలో శ్రద్ధ వహించి ప్రజల మన్నలను పొందాలని అన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ కుర్మిండ్ల దామోదర్ గౌడ్ మాట్లాడుతూ గ్రామ సర్పంచిగా ఎన్నికైన నాటి నుండి గ్రామ అభివృద్ధికి సుమారుగా కోటి 30 లక్షల పైగా నిధులను ఖర్చు చేసి మార్యాల గ్రామాన్ని ప్రజల సహకారంతో అభివృద్ధి పరచామని
అన్నారు. స్మశాన వాటిక, డంపింగ్ యార్డ్, రైతు వేదిక, సిసి రోడ్లు, డ్రైనేజీలు, పల్లె ప్రకృతి వనం, పనులను చేసినట్లు తెలిపారు. గ్రామంలో ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి ఎమ్మెల్సీ 25 లక్షల రూపాయలను కేటాయించినందుకు గ్రామ ప్రజలు, కమిటీ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం బతుకమ్మ పండుగ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామ కమిటీ సభ్యులు ఎమ్మెల్సీ కృష్ణారెడ్డిని ఎలిమినేటి సందీప్ రెడ్డికి శాలువా లు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో
మండల పార్టీ అధ్యక్షుడు పోలగాని వెంకటేష్ గౌడ్, ఉప సర్పంచ్ అశోక్, వార్డు సభ్యులు అన్నారం గణేష్, రాజు కుమార్, మమత, నవనీత, అండాలు, కోఆప్షన్ సభ్యులు ఈదులకంటి రాజిరెడ్డి, ముద్దం ఉదయ్ రెడ్డి, మండల కో ఆప్షన్ సభ్యుడు ఆదిల్, నాయకులు ప్యారారం రాములు,ర్యాకల నరసింహ, తూముకుంట సాయి, ఎస్కే కలీం, బొమ్మలరామారం ఉపసర్పంచ్ జూపల్లి భరత్, మండల వైద్యాధికారి డాక్టర్ శ్రవణ్ కుమార్ పబ్లిక్ హెల్త్ సెంటర్ అధికారులు ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.