మర్రిగూడెం మండలంలో బిజెపి నాయకుల విస్తృత ప్రచారం
వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 16(జనం సాక్షి)
నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో జరుగుతున్న ఉప ఎన్నికల్లో భాగంగా ఆదివారం మర్రిగూడెం మండలం లోని కమ్మరగూడెం, వట్టిపల్లి, దామెర భీమనపల్లి, నాంపల్లి మొదలైన ప్రాంతాలలో బిజెపి నాయకులు ఇంటింటా తిరుగుతూ విస్తృత ప్రచారం నిర్వహించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు వివేక్, ఎర్రబెల్లి ప్రదీప్ రావు, కొల్లూరి యోగానంద్, రాజగోపాల్ రెడ్డి సతీమణి తదితరులు పాల్గొన్నారు