మలాలకు మరో అరుదైన గౌరవం

పాక్ సాహస బాలిక యుసుఫ్ జాయ్ మలాల మరో అరుదైన గౌరవం దక్కించుకుంది. అమెరికా కాలిఫోర్నియాలోని నాసా ల్యాబ్ శాస్త్రవేత్తలు ఓ ఉల్కకు మలాల పేరు పెట్టారు. బాలికల విద్య కోసం మలాల చేసిన కృషికి గానూ ఈ గుర్తింపు దక్కింది. ఓ ఉల్కకు మలాల పేరు పెట్టటం గొప్ప విషయమని నాసా ఖగోళ శాస్త్రజ్ఙుడు ఎమీ మైంజర్ తెలిపారు. ఇంతకుముందు చాలామందికి ఈ గౌరవం లభించినప్పటికీ మహిళల కోసం పనిచేసిన మహిళకు దక్కడం మాత్రం అరుదని చెప్పారు. బాలికల విద్య కోసం ఉగ్రవాదుల తూటాలను ఎదుర్కొని నిరంతరం కృషి చేస్తున్న మలాలకు ఇప్పటికే నోబెల్ శాంతి బహుమతి దక్కింది.