మలాలాపై దాడి చేసిన వారికి పాతికేళ్ల జైలు
పెషావర్, ఏప్రిల్30(జనంసాక్షి):
నోబెల్ గ్రహీత మలాలాపై దాడికి పాల్పడిన నలుగురికి ఈరోజు ఉగ్రవాద నిరోధక కోర్టు 25ఏళ్ల జైలు శిక్ష విధించింది. బాలికా విద్యను ప్రోత్సహించి నందుకుగాను 2012 అక్టోబర్‌లో పాఠశాలకు వెళ్లి వస్తున్న మలాలా యూసుఫ్‌జాయ్‌తో పాటు మరో ఇద్దరు బాలికలపై తాలిబన్లు దాడి చేశారు. దాడికి పాల్పడిన పదిమందిని 2014 సెప్టెంబర్‌లో అరెస్ట్ చేసినట్లు పాకిస్థాన్ ఆర్మీ తెలిపింది. తాలిబన్ల దాడిలో తీవ్రంగా గాయపడిన మలాలా తర్వాత లండన్‌లో చికిత్స పొందింది. ఎంతో ‘య్రర్యంగా దాడిని ఎదుర్కొని నిలిచిన మలాలాకు నోబెల్ శాంతి బహుమతి లభించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఈరోజు ఉగ్రవాద నిరోధక కోర్టు తీర్పు వెలువరించింది