మల్లన్నసాగర్‌కు భూములిస్తాం

C

-ముందుకొచ్చిన సింగారం

– మంత్రి హరీశ్‌ చర్చలు సఫలం

మెదక్‌,జులై 31(జనంసాక్షి): ప్రాజెక్టు భూసేకరణలో తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది.మల్లన్న సాగర్‌ నిర్మాణానికి అన్నదాతలంతా మద్దతుగా నిలుస్తున్నారు. మొన్న పల్లె పహాడ్‌.. నిన్న ఎర్రవెల్లి.. తాజాగా కొండపాక మండలం సింగారం గ్రామస్తులు కూడా మల్లన సాగర్కు జై కొట్టారు. మంత్రి హరీశ్‌ రావుతో చర్చలు జరిపిన గ్రామస్తులు? మల్లన్న సాగర్‌ ప్రాజెక్టుకు భూములు ఇచ్చేందుకు అంగీకరించారు. అటు.. మల్లన్న సాగర్‌ ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చేందుకు ముందుకు వచ్చిన సింగారం గ్రామస్తులకు మంత్రి హరీశ్రావు ధన్యవాదాలు తెలిపారు. భూసేకరణ జరిగిన నెలలోపే పరిహారం అందజేస్తామన్నారు. గ్రామంలోనే రిజిస్ట్రేషన్‌ లు చేసి.. నేరుగా లబ్దిదారులకే చెక్కులు ఇస్తామన్నారు. భూములు లేని ఎస్సీ, ఎస్టీలకు కార్పోరేషన్‌ ల ద్వారా ప్రభుత్వం ఆదుకుంటదని మంత్రి హరీశ్రావు హావిూ ఇచ్చారు. . భూములు ఇచ్చేందుకు అంగీకరించిన సింగారం గ్రామస్థులకు నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామస్థులతో చర్చలు జరిపిన అనంతరం మంత్రి విూడియాతో మాట్లాడుతూ.. భూసేకరణ జరిగిన నెల రోజుల్లోపే పరిహారం చెల్లిస్తామని స్పష్టం చేశారు. గ్రామంలోనే రిజిస్ట్రేషన్‌ చేసి నేరుగా లబ్ధిదారులకు చెక్కులు అందజేస్తామని ప్రకటించారు. కాంగ్రెస్‌ హయాంలో కట్టిన ప్రాజెక్టుల భూనిర్వాసితులు ఇప్పటికీ పరిహారం కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని తెలిపారు. ముంపు గ్రామాల ప్రజలను సీఎం కేసీఆర్‌ అన్ని విధాలుగా ఆదుకుంటారని పేర్కొన్నారు. పరిహారం చెల్లింపులో ఆలస్యం లేకుండా చేయడానికే జీవో 123 తీసుకొచ్చామని చెప్పారు. భూములు లేని ఎస్సీ, ఎస్టీలకు కార్పొరేషన్‌ ద్వారా ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసానిచ్చారు.తెలిపారు. సింగారం గ్రామస్థుల త్యాగాన్ని ప్రభుత్వం ఎన్నటికీ మరిచిపోదని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సింగారం పేరుతోనే పునరావాస గ్రామాన్ని నిర్మిస్తామన్నారు.