మల్లన్నసాగర్‌ మహా ఉద్రిక్తత

C

– గాల్లోకి కాల్పులు

– ఖాకీల కర్కశం

– రైతులపై లాఠీ చార్జి

– 20మందికి గాయాలు

– ప్రజాస్వామిక తెలంగాణ కావాలి

– కోదండారం

– నేడు మెదక్‌ జిల్లా బంద్‌

మెదక్‌,జులై 24(జనంసాక్షి):మల్లన్నసాగర్‌ ముంపు గ్రామాలపై కేసీఆర్‌ సర్కార్‌ తుపాకులు ఎక్కుపెట్టింది. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మల్లన్నసాగర్‌ భూనిర్వాసితులపై పోలీసులు నిర్బంధకాండ ప్రదర్శించారు. గ్రామస్తులపై పోలీసులు దౌర్జన్యం చేశారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న గ్రామస్తులపై దాష్టీకానికి పాల్పడ్డారు. ఎర్రవెల్లి గ్రామస్తులపై పోలీసులు లాఠీచార్జీ చేశారు. మహిళలు, పిల్లలకు గాయాలు అయ్యాయి. మల్లన్నసాగర్‌ ప్రాజెక్టుకు భూములు ఇవ్వబోమని ముంపుగ్రామం ఎర్రవల్లి ప్రజలు ఆందోళన చేపట్టారు. జాతీయ రహదారి దిగ్బంధానికి యత్నించారు. ఈనేపథ్యంలో పోలీసులు, గ్రామస్తుల మధ్య తోపులాట జరిగింది. దీంతో గ్రామస్తులపై పోలీసులు లాఠీచార్జ్‌ చేశారు. గాల్లోకి కాల్పులు జరిపారు. పోలీసుల లాఠీచార్జ్‌ లో మహిళలు, పిల్లలకు గాయాలు అయ్యాయి. రైతు సంఘం మెదక్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి జయరాజు, సీపీఎం నేత భాస్కర్‌ కు త్రీవ గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మొత్తం 20 మందికి గాయాలయ్యాయి. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.   మల్లన్న సాగర్‌ ప్రాజెక్టు ముంపు గ్రామాలకు సంబంధించిన భూములను సేకరించే విషయంలో ప్రభుత్వం, పోలీసులు అమలు ఙరుగుతున్న దమనననీతిని, దౌర&ఙన్యపూరిత విధానాలపై నిరసన వ్యక్తం చేయడానికి ప్రయత్నం చేసిన ప్రఙలపై ఆదివారంనాడు పోలీసులు ఙరిపిన లాఠీఛార్జి, భాష్పవాయు గోళప్రయోగాన్ని టీఙేయేసీ చైర్మన్‌ కోదండరామ్‌ తీవ్రంగా ఖండినీచారు.  . ప్రఙా స్వామ్యంలో తమ ఇష్టాయిష్టాలను, నిరసనను వ్యక్తం చేసేహక్కు ప్రఙలకుంటుంది. ప్రభుత్వం, ప్రభుత్వ ప్రతినిధులు ప్రఙలకు అందుబాటులో లేనప్పుడు,  ప్రఙలు తమ అభిప్రాయాలను తమకు వీలున్న పద్ధతుల్లో, తమకు అందుబాటులో ఉన్న మార్గాలలో వ్యక్తీకరించే ప్రయత్నం చేస్తారు.  అనేక త్యాగాలతో, పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో  ప్రజలు తమ అభిప్రాయ లను  వ్యక్తం చేసేందుకు అవకాశాలు లేకపోవడం, ఈ నేపధ్యనింలో నిరసన వ్యక్తం చేయడానికి ప్రయత్నీంచిన ప్రఙలను సాయుధ పోలీసులతో అణచి వేసేందుకు బలప్రయోగాన్ని ఉపయోగించడం వాంఛనీయంకాదు. ఇప్పటికైనా మల్లన్న సాగర్‌ ప్రాజెక్టు ప్రతిపాదనలకు సంబంధించిన సమగ్ర నివేదిక (ఆ.ఖ.ఖీ)ను ప్రఙాక్షేత్రంలో  చర్చకు పెట్టి, అందరి అభిప్రాయాలను స్వీకరించాలని టీజేయేసీ డిమాండ్‌ చేస్తున్నది. అంతవరకూ మల్లన్న సాగర్‌ ప్రాజెక్టు కోసం బలవంతపు మూసేకరణను ఆపాలని, భూముల రిఙిస్ట్రేషన్లు నిలపాలని టీజేయేసీ ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నదని,.  ఆదివారంనాడు పోలీసులు జరిపిన లాఠీఛార్జీలో గాయపడిన మల్లన్నసాగర్‌ ముంపు గ్రామాల బాధితులను పరామర్శించేందుకు కోదండరామ్‌ నాయకత్వంలో టీజేయేస ప్రతినిధుల బృందం సోమవారం ఉదయం పలు గ్రామాల్లో పర్యటిస్తుందని,  . సోమవారం ఉదయం 8 గంటలకు అల్వాల్‌ జేయేసీ అమరవీరుల కేంద్రం నుండి ప్రారంభమయ్యే పలు మంపు గ్రామాల్లో పర్యటించి గాయపడిన బాధితులను పరామర్శిస్తారు. పోలీసుల లాఠీఛార్జీలో గాయపడి గజ్వేల్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కూడా టీజేయేసీ నాయకులు పరామర్శిస్తారు

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం..

‘మల్లన్నసాగర్‌ భూ నిర్వాసితులపై పోలీసులు లాఠీచార్జీ చేయడం దుర్మార్గం. లాఠీచార్జ్‌ ను ఖండిస్తున్నాం. సమస్యలను శాంతియుతంగా విన్నవించుకుంటుంటే లాఠీచార్జీ చేయడం దారుణం. టీసర్కార్‌ చెప్పేదొకటి చేసేది మరోటిగా ఉంది. ఒకవేల భూములు తీసుకోవడం అనివార్యమైతే 2013 చట్టం అమలు చేయాలని మల్లన్నసాగర్‌ ముంపు గ్రామాల ప్రజలు అడుగుతున్నారు. వారి సమస్యలు చెబుతుంటే…. రైతులపై కాల్పులు జరపడం ఏంటీ..? ప్రభుత్వం 123 జీవోను అమలు చేయాలనే తలంపుతో ఉంది. లాఠీచార్జీ ఘటనకు సీఎం కేసీఆర్‌ బాధ్యత వహించాలి. కేసీఆర్‌ 2013 చట్టం అమలు చేయడంతో అభ్యంతరం లేదంటాడు… మంత్రి హరీష్‌ రావు జీవో 123 అమలు చేస్తామంటాడు.. మామా అల్లుళ్ల మధ్య ఏమైనా వారి ఇంట్లో చూసుకోవాలి. ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం తగదు’ అని పేర్కొన్నారు.

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్‌ రెడ్డి..

మల్లన్నసాగర్‌ భూనిర్వాసితులపై పోలీసుల లాఠీచార్జీ, కాల్పులను తీవ్రంగా ఖండిస్తున్నాం.

సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే… కాల్చి చంపుతారా…? ఘటనకు సీఎం కేసీఆర్‌ క్షమాపణ చెప్పాలి. ఏదిఏమైన 50 టీఎంసీల రిజర్వాయర్‌ నిర్మాంచాలని ప్రభుత్వం పట్టుదలతో ఉంది. ప్రభుత్వం అప్రజాస్వామిక, అహంకారపూరితంగా వ్యవహరిస్తుంది. మొండివైఖరితో వెలితే అది అసాధ్యం. ప్రజల అభిమతం మేరకు నడుచుకోవాలి.

జస్టిస్‌ చంద్రకుమార్‌..

‘పోలీసుల లాఠీచార్జ్‌ ను త్రీవంగా ఖండిస్తున్నాను. ప్రజల కోపం, ఊరేగింపుకు కారణం ఏంటని ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఎర్రవల్లిలో 50 టీఎంసీల రిజర్వాయర్‌ అవసరం లేదని మేధావులు, నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలనే తలంపుతో ఉంది. ఘటన ప్రభుత్వ దమననీతిని తెలియచేస్తుంది. ప్రభుత్వం ఇలానే వ్యహరిస్తే.. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని’ అన్నారు.

టీడీపీ నేత రేవంత్‌ రెడ్డి..

‘పోలీసుల లాఠీచార్జ్‌ దుర్మార్గం. రాష్ట్రంలో పోలీసుల రాజ్యం నడుస్తోంది. పోలీసుల దుశ్చర్యకు పాల్పడడం దారుణం.

మహిళలపై పోలీసులు బూటు కాళ్లతో తన్నారు. ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా కాకుండా.. పోలీసులు, తుపాకీ తూటాల చేత పరిపాలన చేయాలనుకుంటున్నారు. కేసీఆర్‌, హరీశ్‌ రావు తన ఉక్కుపాదంలో పాలన ఉండాలని భావిస్తున్నారు. ప్రజల హక్కులను కాలరాస్తున్నారు. ప్రాజెక్టులకు ఎవరు అడ్డుకాదు…..ఒకవేల భూములు ఖాళీ చేయిస్తే 2013 చట్టం ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. తెలంగాణ రైతాంగంపై తుపాకీ ఎక్కుపెట్టిన వారు బతికి బట్టకట్టలేదు. కేసీఆర్‌ అడ్డమైన స్లోగన్లు ఇస్తున్నారు. పోలీసుల లాఠీచార్జీలు, కాల్పులతో రైతులు భూములు తీసుకోలేరు. రైతులకు అండగా ఉంటామని’ చెప్పారు.

కాంగ్రెస్‌ నేత మల్లు భట్టి విక్రమార్క…

‘పోలీసుల లాఠీచార్జీని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఘటన చాలా బాధాకరం. మల్లన్నసాగర్‌ భూ నిర్వాసితులు కూడా తెలంగాణ ప్రజలే..కదా అన్నారు. లాఠీచార్జీ, కాల్పులు ఘటనకు పాల్పడుతూ ప్రభుత్వం అప్రజాస్వామికంగా, నియంతలా వ్యవహరిస్తుందని’ చెప్పారు.

లాఠిచార్జ్‌ కు నిరసనగా రేపు మెదక్‌ జిల్లా బంద్‌

మల్లన్నసాగర్‌ ముంపు ప్రాంతాల జనం ఆందోళనకు దిగారు. 2013 భూసేకరణ చట్టం అమలు చేయడంతోపాటు.. ముంపు ప్రాంత పరిధి తగ్గించేలా ప్రాజెక్టు రీడిజైన్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ.. ఎర్రవల్లి, వేములఘాట్‌, ఏటిగడ్డ కిష్టాపూర్‌ గ్రామస్థులు రాజీవ్‌ రహదారిపై ఆందోళనకు రెడీ అయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామస్థులను రోడ్డుపైకి రాకుండా అడ్డుకున్నారు. ఇదే టైమ్‌ లో కొందరు పోలీసులపైకి  రాళ్లు విసరడంతో.. లాఠిచార్జి జరిగింది. పరిస్థితి ఎంతకీ అదుపులోకి రాకపోవడంతో పోలీసులు గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపారు.పోలీసుల లాఠీ చార్జీలో పలువురికి గాయాలయ్యాయి. దీంతోవారికి స్థానికంగా చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న విపక్షాలు నేతలు.. ముంపు బాధితులకు మద్దతుగా గ్రామాల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు.  దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. రేపు మెదక్‌ జిల్లా బంద్‌ కు పిలుపునిచ్చాయి విపక్షాలు.పోలీసుల లాఠిచార్జి దురదృష్టకరమన్నారు జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌. డీపీఆర్‌ లేకుండానే ప్రభుత్వం ప్రాజెక్టులు కడుతుందన్నారు. విపక్షాల నిరసనను తప్పుబట్టారు ఇరిగేషన్‌ మంత్రి హరీష్‌ రావు. తెలంగాణ ఏర్పాటుకు అడ్డుపడిన కాంగ్రెస్‌,  టీడీపీలు ఇపుడు రైతుల కన్నీళ్లు తుడుస్తామంటే  అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు. జనం ఆందోళనలతో మల్లన్నసాగర్‌ ముంపు గ్రామాల్లో పికెటింగ్‌ ఏర్పాటు చేశారు పోలీసులు. ఎలాంటి గొడవలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.