మల్లన్న ఆలయ మాజీ చైర్మన్ బిక్షపతి చేసిన అవినీతి పై కలెక్టర్ స్పందించాలి

భూ కబ్జాలకు పాల్పడుతున్న మాజీ చైర్మన్ బిక్షపతి

గతంలోనే బిక్షపతి అవినీతిని వెలికి తీసిన సిపిఎం

అతనిపై విచారణ చేపట్టలని సిపిఎం పార్టీ డిమాండ్

కొమురవెల్లి జనం సాక్షి

కొమురవెల్లి మల్లన్న ఆలయ మాజీ చైర్మన్ చేసిన అవినీతి పై జిల్లా కలెక్టర్ స్పందించాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి శెట్టిపల్లి సత్తి రెడ్డి డిమాండ్ చేశారు బుధవారం సీపీఎం పార్టి కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ బిక్షపతి చైర్మన్ పదవి లో వున్నపుడే అవినీతికి పాల్పడిన విషయం సిపిఎం పార్టీ వెలికితీసిందని గుర్తు చేశారు. పదవిని అడ్డంపెట్టుకుని మండలంలో అనేక భూకబ్జాలకు పాల్పడ్డాడని అయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందని తెలిపారు. సీఎం సొంత జిల్లాలో మల్లన్న ఆలయంలో భారీ అవినీతికి పాల్పడినట్లు కరపత్రాలు వెలువడ్డ ప్రభుత్వం యంత్రాంగం, జిల్లా మంత్రి, స్థానిక ఎమ్మెల్యే స్పందించకపోవడం విడ్డూరంగా ఉందని అసహనం వ్యక్తం చేశారు.
మల్లన్న భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని తీవ్రంగా మండిపడ్డారు. మల్లన్న ఆలయం వద్ద బిక్షపతి రాష్ట్ర ప్రభుత్వం నుండి ప్రత్యేక నిధులు తెచ్చి  చేసిన అభివృద్ధి ఏమీ లేదని, భక్తులు వేసిన కానుకలు హుండీ ఆదాయాల తోనే  అభివృద్ధి జరిగిందని తెలిపారు. చైర్మన్ పదవి కాలంలో బిక్షపతి చేసిన అవినీతి పై  జిల్లా కలెక్టర్ స్పందించి విచారణ చేపట్టి వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆలయం ముందు దీక్ష చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జిల్లా కమిటీ సభ్యులు బద్ధిపడగ కిష్టారెడ్డి,సనాది భాస్కర్, సర్పంచ్ తాడూరి రవీందర్, మండల నాయకులు ఉల్లం పల్లి సాయిలు, మేకల కృపాకర్, సార్ల యదయ్య , ఆరుట్ల దయానంద్, తదితరులు పాల్గొన్నారు